ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తీవ్రంగా వణికిస్తోన్న ఈ మహమ్మారి కరోనా వలన ఆయా దేశాలన్నీ కూడా లాకౌట్లను ప్రకటించి ఎక్కడి ప్రజలను అక్కడే పూర్తిగా తమ ఇళ్లకు పరిమితం చేయవలసిన పరిస్థితులు తలెత్తాయి. మన దేశాన్ని కూడా 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. అయితే ఈ లాకౌట్ దాదాపుగా ఇన్ని రోజుల పాటు కొనసాగుతుండడం, దానివలన ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాలేకపోవడంతో ఎన్నో వ్యాపార సంస్థలు, సముదాయాలు, ఆఫీసులు, కార్యాలయాలు,ఇండస్ట్రీలు సైతం చాలావరకు ఆర్ధికంగా దెబ్బతినే పరిస్థితులు రావచ్చని అంటున్నారు ఆర్ధిక నిపుణులు. 

 

ఇక ఈ కరోనా ఎఫెక్ట్ మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై కూడా బాగానే ప్రభావం చూపుతోంది. ముందుగా ఇటీవల మార్చి నెల 31 వరకు అన్ని షూటింగ్స్ కూడా బంద్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల ప్రధాని ఏప్రిల్ 14వరకు లాకౌట్ కొనసాగుతుందని చెప్పడంతో అప్పటి వరకు కూడా షూటింగ్స్ నిలిపివేయక తప్పని పరిస్థితి. అయితే దీనివలన కొన్ని పెద్ద సినిమాలకు తీవ్ర తలనొప్పులు మొదలైనట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ఈ లాకౌట్ ప్రభావం తీవ్రంగా పడిందని అంటున్నారు. 

 

ఇప్పటికే చాలా వరకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇటీవల పక్కాగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ అన్ని కూడా ఈ కరోనా ఎఫెక్ట్ తో క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దాని వలన షూటింగ్ పెండింగ్ ఉండిపోయి, సినిమాని అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేమేమో అనే పరిస్థితులు కూడా కొంత కనపడుతున్నాయని అంటున్నారు. వాస్తవానికి ఇటీవల కొన్నాళ్ల క్రితం కొన్ని అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడిందని, ఇక ఇప్పుడు కరోనా వలన దాదాపుగా 25 రోజుల పాటు షూటింగ్ నిలిచిపోవడంతో రాజమౌళి సహా మూవీ టీమ్ మొత్తం కూడా కొంత ఆలోచనలో పడిందట.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: