చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడి పోతున్నాయి. యూరప్ మరియు అగ్రరాజ్యం అమెరికా దేశంలో ఈ వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. మరణాలలో ఇటలీ మరియు స్పెయిన్ దేశాలు ముందుండగా, ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశంగా అమెరికా ముందు ఉంది. పైగా కరోనా వైరస్ కి మందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావటంతో చాలా దేశాలు లాక్ డౌన్ ని ప్రకటిస్తున్నాయి. ఇండియాలో కూడా లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీంతో ప్రపంచ స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.

 

అంతేకాకుండా పేద మరియు మధ్యతరగతి కుటుంబాల జీవనోపాధి దెబ్బతినడంతో  పాటుగా చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమలు సైతం మూతపడ్డాయి. ఇలాంటి పరిణామం ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా భవిష్యత్తులో మారే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు బాగా గట్టిగా వినబడుతున్నాయి. ఇటువంటి టైములో భారతదేశానికి సాయం అందించడానికి వరల్డ్ బ్యాంకు ముందుకు వచ్చింది. అది కూడా ఋణం రూపంలో అందించడానికి ముందుకు వచ్చింది.

 

ఇటీవల ప్రపంచ బ్యాంక్ ప్రపంచ దేశాలకు ఆర్థిక సహాయం ప్రకటించింది. 25 దేశాలకు 1.9 బిలియన్‌ డాలర్ల సాయం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్ ఫండ్‌లో భాగంగా భారత్‌కు రూ.7600 కోట్ల(1 బిలియన్‌ డాలర్లు)ను ప్రపంచ బ్యాంకు కేటాయించింది. వరల్డ్ బ్యాంక్ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌క్యూటివ్‌ డైరెక్టర్స్‌ కీలక నిర్ణయం తీసుకుని సాయం చెయ్యాలని ముందుకి వచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వైద్య రంగానికి సంబంధించి కొనుగోలు విషయంలో ఈ నిధులు వాడాలని సూచించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశానికి ఏడు వేల చిల్లర కోట్లు అసలు సరిపోతుందా అంటూ వచ్చిన ఈ వార్త పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: