ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ చిన్నా, పెద్దా అనే ఏ తేడా లేకుండా అందరినీ కమ్మేస్తుంది. ఈ వైరస్ సోకిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే మరణాన్ని ఆహ్వానించినట్టే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 42 వేల మందికి పైగా మరణించగా.. లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి పట్టున ఉన్న సెలబ్స్ సోషల్ మీడియా పుణ్యమా అని తమ రోజువారి పనుల తాలుకు వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అలాగే కరోనాపై పోరాటానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా ప్రభావం వలన సినిమా షూటింగ్స్, థియేటర్లు మూసి వేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే.

 

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న వారికి తెలుగు చిత్రసీమ నుండి ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి తమ వంతుగా సాయం చేశారు.. చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా దగ్గబాటి ఫ్యామిలీ ముందుకు వచ్చింది. కరోనా కారణంగా ఇబ్బందుల పాలవుతోన్న సినీ కార్మికులను ఆదుకునే ఆలోచనలో భాగంగా ఒక కోటి రూపాయలను సురేష్ బాబు, వెంకటేష్, రానాలు విరాళంగా ప్రకటించారు. 

 

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర చాలా రఫ్‌గా ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది.

 

తమిళంలో స్టార్ హీరో ధనుష్ నటించిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. కరోనా ప్రభావం వలన కొన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. నారప్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నదున్న వెంకీ సేఫ్ అయ్యినట్టే చెప్పుకోవాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: