టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది సంగీత దర్శకులు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మరుపు రాని మరువలేని సంగీతాన్ని అందించారు.  అందులో ఒకరు ఎం ఎం కీరవాణి.  ఆయన సంగీత దర్శకులు మాత్రమే కాదు మంచి సింగర్. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు.  వీరి కుటుంబం నుంచి అతి చిన్న వయసులోనే తన సంగీతంతో అందరి అభిమానం సంపాదించింది ఎంఎం శ్రీలేఖ.  తన 12 వ ఏట 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నాన్నగారు సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. 

 

ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లో 13 చిత్రాలకి సంగీతం అందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తొలిపాట అనుభవాన్ని గురించి ప్రస్తావించింది. చిన్నప్పటి నుంచి నాకు పాటలు వినడం అంటే ఇష్టం .. పాడటమంటే ఇష్టం. ఒకసారి బాలూగారి దగ్గర నేను సరదాగా పాడితే, 'అచ్చం కాకి పాడినట్టుగా వుంది' అంటూ నవ్వేశారు.  అంత గొప్ప సింగర్ తో పాడే అవకాశం తనకు వస్తుందా అనకున్న సందర్భంలో ‘ఆయనకి ఇద్దరు’ మూవీలో బాలు గారితో పాడే అవకాశం వచ్చింది.

 

ఆ సినిమాకి 'కోటి' గారి సంగీత దర్శకత్వంలో బాలుగారితో కలిసి 'అందాలమ్మో అందాలు' అనే పాట పాడాను.  అయితే ఆయన పక్కన నిలబడి పాడుతుంటే మొదట ఎంతో భయం వేసిందని అన్నారు.. కానీ బాలు గారు తనకు ఎంతో ధైర్యాన్ని ఉత్సాహాన్ని అందించారు.   ఆయన సలహాలు .. సూచనలు ఇస్తూ, నాలో భయాన్ని పోగొట్టారు. పాట రికార్డింగ్ పూర్తయిన తరువాత, 'కాకి .. కోకిల అయిందే' అన్నారు. అప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: