కరోనావైరస్ కారణంగా దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకి సెలబ్రిటీలందరూ అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తుంటే మరికొందరు స్వయంగా నిత్యవసర వస్తువులను పేదవారికి ఇచ్చి తమ ఉదాసీనతను చాటుకుంటున్నారు. సెలబ్రిటీలు ఈ విషయంలో ఒకడుగు ముందే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించిన వారిలో కేవలం హీరోలే ఉండటం, హీరోయిన్లు లేకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక బాలీవుడ్ విషయానికొస్తే అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ అందించిన స్ఫూర్తితో పలువురు తమ వంతు సాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు. దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా ముంబైలో కష్టాలు పడుతున్న రోజు వారి కూలీ కుటుంబాలను ఆదుకోడానికి స్టార్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ ముందుకొచ్చారు. బాంద్రా ప్రాంతంలోని అవస్థలు పడుతున్న 2500 మంది కుటుంబాలకు సహాయం అందించానికి సిద్ధమయ్యారు. 

 

బాంద్రా పరిసర ప్రాంతాల్లో నా స్నేహితులిద్దరూ గొప్ప కార్యానికి పూనుకొన్నారు. రోజువారీ కూలీల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను చేరవేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వారిద్దరూ తమ ప్రాణాలకు తెగించి సహాయం చేస్తున్నారు. నేను అందజేసిన డొనేషన్‌ను సక్రమంగా వినియోగం చేస్తున్నారు అని జాక్వలైన్ పేర్కొన్నారు. కూలీల కుటంబాలకు నిత్యావసర వస్తువులను అందజేస్తూ గొప్ప కార్యాన్ని భుజానికెత్తుకొన్న జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఈ  హీరోయిన్ని చూసైనా మిగతా హీరోయిన్లు బుద్ధి తెచ్చుకోవాలని సహాయం చేయడానికి ముందుకురాని హీరోయిన్లపై నెట్రిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. దాంతో మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నది. ఈ క్రమంలో రోజు వారీ కూలీల జీవనం స్థంభించింది. ఈ క్రమంలో ప్రముఖులు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: