మొట్ట‌మొద‌టిసారిగా ప్ర‌పంచ‌మంతా లాక్‌డ‌వున్‌లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ క‌ళక‌ళ‌లాడుతూ ఉండే సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌తో అల‌రిస్తూ ఎంట‌ర్‌టైన్ చేసే హీరోలంద‌రూ స్వీయ‌నిర్బంధ‌న‌లోకి వెళ్లిపోయారు. ఎవ‌రికి వారు సైలెంట్ అయిపోయారు. సినిమాలు లేక తీసిన సినిమాలు విలుద‌ల ఆగిపోయి. కొన్ని పెద్ద సినిమాలు షూటింట్ మ‌ధ్య‌లోనే ఆగిపోయి ఇలా నానా తంటాలు ప‌డుతున్నారు. దీని వ‌ల్ల ఇండ‌స్ట్రీకి తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు రెండు వేల కోట్ల దాకా న‌ష్టం వ‌చ్చిన‌ట్లు సమాచారం.

 

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్‌సాబ్  చిత్రం దాదాపు 250 కోట్లు న‌ష్టం వ‌చ్చిన‌ట్లే అందులో ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌నే దాదాపు 50 వ‌ర‌కు ఉంది. ఇక ఇప్ప‌టికే ప్రీ రిలీజ్ బిజినెస్ అని అద‌ని ఇద‌ని దీన్ని చాలా వ‌ర‌కు బిజినెస్ చేసేవాళ్ళు. అలాగే ఆర్‌.ఆర్‌.ఆర్ 1500కోట్లు న‌ష్ట‌మ‌ని చెప్పాలి. ఇవి రెండు కూడా కోన్ని వేల కోట్ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రాలు వీటి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళితే తీవ్ర న‌ష్టం క‌లిగింద‌నే చెప్పాలి.ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకూ ప్ర‌భ‌లడం వ‌ల్ల సినిమాలు విడుద‌లలు లేక కొనేవారు లేక పూర్తి న‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఇక ఇప్పుడ‌ప్పుడే సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యే నేప‌థ్‌యం క‌న‌ప‌డ‌టం లేదు.

 

ఒక‌వేళ అన్ని పరిస్థితులు చ‌క్క‌డ‌బడినప్ప‌టికీ తిరిగి మ‌ళ్ళీ పుంజుకోవ‌డం అంటే కాస్త క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఒక‌ప్పుడు సినిమాలంటే ఎగ‌బడి మ‌రీ చూసే జ‌నం ఇప్పుడు థియేట‌ర్‌కి వ‌చ్చి సినిమా చూస్తారా అన్న ఆలోచ‌న‌లు కూడా చాలానే వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న పరిస్థితులు అలాంటి అనుమానాల‌కు తావిస్తోంది. ప్ర‌స్తుతం మొత్తం అంతా స‌ర్దుకునే స‌రికి జూన్ నెల అవుతుంద‌ని సినీ వ‌ర్గాలు చెబుతున్నారు. అయితే  దాదాపు వ‌కీల్ సాబ్ మీదే 250 బిజినెస్ అవుతుంద‌ని ప్లాన్ చేసుకున్నారు.ప‌వ‌న్‌కి 50 షేర్ 100 ఇలా అంచ‌నాలు వేసుకున్న‌వ‌న్నీ క‌రోనా దెబ్బ‌తో మొత్తం ప్లాన్ల‌న్నీ తారుమారు అయిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: