చాలా సంవత్సరాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కాజల్ అగర్వాల్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు దక్షిణ భారతదేశంలోనే ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కొద్దికాలంలోనే పెద్ద నటిగా పేరుతెచ్చుకున్న కాజల్ స్క్రీన్ పైన ఒలకబోసే అందాలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా రోజులు స్టార్ హీరోయిన్ గా కొనసాగినా.. లెక్కలేనన్ని ప్రాజెక్టులు అన్నీ భాషల్లో చేసినా 'కాజల్ గొప్ప నటి' అన్న పేరు సంపాదించలేకపోవడం దురదృష్టకరం.

 

తన తర్వాత వచ్చిన సమంత మరియు కీర్తి సురేష్ కు దక్కిన మంచి పాత్రలు మరియు గొప్ప పేరు కాజల్ కు దక్కలేదు. అలాగని తానేమి చిన్నా చితకా హీరోయిన్ కాదు. ఇప్పటికి కూడా తన స్టార్ డమ్ ఏమీ పెద్దగా తగ్గలేదు అయితే మధ్యకాలంలో అమ్మడు చాలా కక్కుర్తిగా వ్యవహరించడం సినీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. గతంలో లాగా తన వద్దకి పెద్ద ప్రాజెక్టులు రాకపోవడం వల్లనో.... లేకపోతే హిందీలో అడుగుపెట్టి విఫలమైన తర్వాత తనపై తనకు నమ్మకం సన్నగిల్లిందో ఏమో తెలియదు కానీ కాజల్ మాత్రం చాలా కక్కుర్తిగా వ్యవహరిస్తోంది.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే చిరంజీవి మరియు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నా సినిమా కోసం సినిమా యూనిట్ ఈమెను హీరోయిన్ ఛాన్స్ అడగగా కథ వినకుండానే ఓకే చెప్పేసిందట. ఇదే టైమ్ లో విజయ్ సినిమా తుపాకీ రీమేక్ కి కూడా విధంగానే వ్యవహరించటం పట్ల చాలామంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఏంటి స్టార్ హీరోయిన్ అయ్యుండి కాజల్ అగర్వాల్ ఇంత కక్కుర్తిగా వ్యవహరిస్తుంది అని అంటున్నారట. స్టోరీలు వినకుండానే సినిమాలు ఓకే చేయటం అంటే హీరోయిన్ మార్కెట్ పడిపోయింది అని అర్థం

మరింత సమాచారం తెలుసుకోండి: