క‌రోనా ఎఫెక్ట్ సినిమాల పైన బాగానే ప‌డింది. అందులోనూ దాదాపు రెండేళ్ళ గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న ప‌వ‌న్ పింక్‌రీమేక్ చిత్రం వ‌కీల్ సాబ్ మీద ఆ ఎఫెక్ట్ కాస్త ఎక్కువ‌గానే ఉంద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే ఈ చిత్రం దాదాపు రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకుంది. త్వ‌ర త్వ‌ర‌గా షెడ్యూల్స్ పూర్తి చేసుకుని మ‌రో చిత్రానికి వెళ్ళిపోవ‌డానికి ప‌వ‌న్ చాలా ఆశ‌గా ఎదురు చూశారు. కానీ కారోనా దెబ్బ‌కి అనుకున్న‌దొక్క‌టి అయిన‌ది ఒక్క‌టి అన్న‌ట్లు అయింది. వ‌కీల్ సాబ్ చిత్రానికి దాదాపు 250 కోట్ల వ‌ర‌కు న‌ష్టం వ‌చ్చిన‌ట్లు సినీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. చాలా గ్యాప్ త‌ర్వాత ఈ చిత్రంతో వ‌స్తున్న ప‌వ‌న్‌కు క‌రోనా ఎఫెక్ట్ బాగానే త‌గిలింద‌ని చెప్పాలి. ఇక దిల్‌రాజు కూడా ఈ చిత్రంతో తీవ్రంగా న‌ష్ట‌పోయాడ‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

 

అయితే చాలా గ్యాప్ త‌ర్వాత రావ‌డంతో ప‌వ‌న్ ఎంత డిమాండ్ చేస్తే అంత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డానికి దిల్ రాజు సిద్ధ‌ప‌డ్డాడు. అంతేకాక ఒక ర‌కంగా చెప్పాలంటే దిల్‌రాజు ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్య‌డ‌మే పెద్ద త‌ప్పు అని కొంద‌రు భావిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బాలీవుడ్‌లో మంచి హిట్ అయిన ఈ మూవీ ఇప్ప‌టికే అమెజాన్ ప్రైమ్, నెట్‌ప్లిక్స్‌ల‌లో దాదాపు అంద‌రూ చూసేసిన చిత్ర‌మే మ‌ళ్ళీ ఇప్పుడు ప‌వ‌న్ కోసం ప్ర‌త్యేకంగా టికెట్ కొని మ‌రీ ధియేట‌ర్‌కి వ‌చ్చి చూసేవారు చాలా త‌క్కువ‌నే చెప్పాలి.

 

అందులోనూ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది కాస్త ఆలోచించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అలాగే ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్ లో కూడా దిల్ రాజు కోత పెట్టే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం. ఇక వ‌కీల్ సాబ్ ఎంత స‌క్సెస్ అవుతుంద‌నేది పెద్ద డైల‌మా అయిపోయింది. ఇక దిల్ రాజుకి కూడా సినిమా మీద పెట్టుకున్న హోప్స్ అటూ ఇటూ అయిన‌ట్లే లెక్క‌. ఆల్రెడీ రెండు భాష‌ల్లో చూసిన చిత్రాన్ని రీమేక్ చెయ్య‌డం అన్న‌ది పొర‌పాటు దానికి తోడు ఈ క‌రోనా ఎఫెక్ట్ అన్న‌ది యాడ్ అయింది. మొన్న‌టి వ‌ర‌కు కాస్తో కూస్తో హోప్స్ ఉండేది క‌నీసం పెట్టిన పెట్టుబ‌డి అన్నా వ‌చ్చుది అనేది కానీ ఇప్పుడు ప‌రిస్థితులు అలా లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: