కరోనా దెబ్బకి షూటింగ్స్ లేక సినీ పరిశ్రమ కళ తప్పింది. పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్స్ కంటిన్యూ చేయాలి. అయితే.. స్టార్ హీరోల సినిమాలకు బిజినెస్ ఎలా జరుగుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న భారీ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వచ్చే షెడ్యూల్స్ లో ఖర్చును తగ్గించే యోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం.

 

 

సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలకపాత్ర కోసం మహేశ్ ను సంప్రదించిన విషయం తెలిసిందే. మహేశ్ 40కోట్లు డిమాండ్ చేశాడని టాక్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో మహేశ్ కాకుండా చరణే ఆ రోల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చరణ్ వల్ల రెమ్యునరేషన్ విషయంలో ఖర్చు భారీగా తగ్గినట్టే. మహేశ్ కోసం పూజా హేగ్డేను హీరోయిన్ గా తీసుకురావాలన్న ఆలోచన కూడా ఉండకపోవచ్చు. ఈ రోల్ కు రష్మికను సంప్రదించారని వార్తలు వచ్చాయి. దీంతో రెమ్యునరేషన్ పెద్ద సమస్య కాబోదు. పాటలు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వంటి కీలకమైన షూటింగ్ జరగాల్సి ఉంది. వచ్చే షెడ్యూల్స్ లో ఎంత ఖర్చు తగ్గిస్తే సినిమా బిజినెస్ అంత సేఫ్ అయ్యే అవకాశం ఉంది.

 

 

ఇక సినిమాను గ్రాండియర్ గా తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్న కొరటాల శివకు ఖర్చు తగ్గించడంలో ఒత్తిడి తప్పదు. ఇకపై జరిగే ప్రతి షెడ్యూల్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి. చిరంజీవి సినిమా కాబట్టి కలెక్షన్లకు ఢోకా లేకపోయినా కరోనా తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. సైరా విషయంలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా తక్కువ ఖర్చుతో సినిమా చేస్తే మంచి ఫలితాలు రావొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: