ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా 'ఆర్.ఆర్.ఆర్' మాటే వినిపిస్తోంది. ఒక సినిమాని జనాల్లోకి ఎలా తీసుకుపోవాలో రాజమౌళికి తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు అని చెప్పవచ్చు. ఒక్కసారి బయటకి వచ్చి ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేసాడంటే అది రిలీజై సూపర్ హిట్ అయ్యే దాకా జనాల మధ్య తిరుగుతూనే ఉంటుంది. ఇటీవలే ఉగాది సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను, మోస్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ తరవాత రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ ఒక్క వీడియో సినిమా అంచనాలను రెట్టింపు చేసింది. సినిమాను పబ్లిసిటీ చేసుకోవడంలో రాజమౌళిని మించిన దర్శకుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచమంతా కరోనా దెబ్బకి వణికిపోతున్న ఈ సమయంలో కూడా తన 'రౌద్రం రణం రుధిరం' సినిమాని జనాల్లోకి తీసుకెళ్లగలిగాడు. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ వీడియోకి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకి వచ్చింది.

 

వివరాల్లోకి వెళ్తే మే 20వ తేదీన ఎన్టీఆర్ వీడియో రానున్నదని సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్టుగా రామ్ చరణ్ కూడా ఒక స్పెషల్ వీడియో రెడీ చేపిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'రామరాజు ఫర్ భీమ్' అన్నమాట. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అంటూ వచ్చిన వీడియోలో ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 'రామరాజు ఫర్ భీమ్' పేరుతో రాబోయే ప్రత్యేక వీడియోలో ఏ రేంజ్ లో సర్ ప్రైజ్ చేస్తారో అని ప్రస్తుతం ఫ్యాన్స్ లో చర్చ నడుస్తోంది. ఈ వీడియోలో రామ్ చరణ్ వాయిస్‌ ఓవర్ ఉండదు అట. ఎన్టీఆర్ నే స్వయంగా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్‌లను చెబుతారని, అలాగే ఎన్టీఆర్ కి సంబంధించిన కీలకమైన పులితో ఫైట్ సీన్స్ కూడా రివీల్ చేయబోతున్నారని.. ‘ఎన్టీఆర్’ సర్ ప్రైజ్ వీడియోలో ఇవే హైలైట్స్ గా నిలివబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ న్యూస్ ఎన్టీఆర్ అభిమానులను బాగా ఉత్సాహపరుస్తోంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: