టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి2’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఈ మద్య ఇచ్చారు.  ఉగాది పండుగ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగులో 'రౌద్రం రణం రుధిరం' అనే పేరును ఖరారు చేశారు. హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో 'రైజ్‌ రోర్‌ రివోల్ట్‌' అనే పేరుని, తమిళంలో 'రథమ్‌ రణమ్‌ రౌథిరమ్‌', మలయాళంలో 'రుధిరమ్‌ రణమ్‌ రౌద్రమ్‌', కన్నడలో 'రౌద్ర రణ రుధిర' అనే పేర్లని ఖరారు చేశారు. 

 

మూవీ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది.  అంతే కాదు ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్ర రామ్ చరణ్ కి సంబంధించిన ఓ వీడియో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేశారు.  అయితే  ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక వీడియోను వదలగా అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. నిన్న అజయ్ దేవగణ్ పుట్టినరోజు అయినప్పటికీ, ఈ సినిమా నుంచి ఎలాంటి వీడియోను రిలీజ్ చేయలేదు.

 

ఈ విషయంపైనే రాజమౌళి టీమ్ అజయ్ దేవగణ్ కి సారీ చెప్పింది. అజయ్ దేవగణ్ బర్త్ డే సందర్భంగా ప్లాన్ చేసిన వీడియోను కొన్ని సాంకేతిక కారణాల వలన విడుదల చేయలేకపోయినట్టు సోషల్ మాద్యం ద్వారా తెలిపారు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉండటంతో పలు షూటింగ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే.  కొన్ని సినిమాల రిలీజ్ కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెడతామని అంటున్నారు.  అయితే రాజమౌళి ఎట్టి పరిస్థితిలో అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తామంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: