యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ 'రౌద్రం రణం రుధిరం'.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అత్యంత భారీగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో తారాగణం కూడా అంతే భారీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.. చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్‌ను ఎన్టీఆర్‌కు జతగా తీసుకున్నారు. ఈ సినిమాలో 'అల్లూరి సీతారామరాజు'గా రామ్ చరణ్, 'కొమరం భీమ్‌'గా ఎన్టీఆర్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

 

బాహుబలి తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని రాజమౌళి తీస్తున్న చిత్రం కావడం, ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ లు మిగతా కమిట్మెంట్స్ పక్కన పెట్టి రెండేళ్ల డేట్స్ రాజమౌళికి ఇచ్చారు. యావత్ సినీ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'.. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన రాజమౌళి చరణ్ పుట్టినరోజు కానుకగా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు. దీంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమాని ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో 'అల్లూరి సీతారామరాజు'గా రామ్ చరణ్, 'కొమరం భీమ్‌'గా ఎన్టీఆర్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

 

సినిమా విడుదలకు చాలా టైమ్ ఉన్నా, ఈ చిత్రానికి ఎలాంటి క్లైమాక్స్ ఇస్తారో అనే చర్చ సినీ అభిమానుల్లో స్టార్ట్ అయింది. ఈ మధ్య విడుదలైన  రామ్ చరణ్ ఇంట్రో వీడియోలో 'అల్లూరి సీతారామరాజు'గా చరణ్ ని పోలీస్ గెటప్ లో పరిచయం చేశాడు. యూనిఫార్మ్ లో మీసం తిప్పుతున్న రామ్ చరణ్, చొక్కాలేకుండా పోలీస్ బెల్ట్, ప్యాంటు ధరించి ఉన్న సీన్స్ ఉన్నాయి. ఈ వీడియో తరువాత ఈ మూవీలో కల్పితం ఎక్కువే అనే విషయం అర్థం అవుతుంది. చరిత్ర చూసుకుంటే కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్వాతంత్ర్య ఉద్యమంలో వీరమరణం పొందారు. వీరు అతి తక్కువ వయసులోనే బ్రిటిష్ మరియు నవాబుల చేతిలో చనిపోయారు. రాజమౌళి చరిత్రను ఫాలో అవుతూ వీరి పాత్రలు మరణంతో ముగిస్తాడా, ఫిక్షనల్ స్టోరీ కాబట్టి వారిద్దరి చావు చూపించకుండా శుభం కార్డు వేస్తాడా అనే ఆలోచన చాలా మంది మదిలో మెదులుతోంది. రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ పాత్రలను ఆర్.ఆర్.ఆర్ లో ఎలా ముగిస్తాడో తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి 8న సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: