కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాల ను కలపెట్టడమే కాకుండా ప్రపంచం లో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి.. భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణ కు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. 

 

 

 

 

అయితే ఈ కరోనా ను కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఇందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. 

 

 


అయితే కరోనా నుంచి మనల్ని మనం ఎలా  కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్, తన కొడుకు  విన్నీ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేశారు.

 

 


ఆ వీడియోలో చౌరాస్తా బ్యాండ్ పాడి ప్రభంజనం సృష్టించిన ''చేతులెత్తి మొక్కుతా.. చెయ్యి చెయ్యి  కలపకు'' అనే పాటకు డ్యాన్స్ స్టెప్పులు వేశారు. ముందే  డ్యాన్స్ మాస్టర్ మ్యూజిక్ ఉంటె కొత్త స్టెప్పులు వేస్తారు. ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్న ఈ పాటకు వీరు వేసిన స్టెప్పులు  వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎంతైనా డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ అంతే అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఓ లుక్ వేసుకోండి .. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: