సెల‌బ్రెటీలు సైతం కొంత మంది కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ట‌. అయితే అవి ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడూ బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌వు మ‌రి అవేంటి అది ఎవ‌రెవ‌రు అన్న‌ది ఓ సారి చూద్దాం... సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ 2011 సంవత్సరం లో ‘ఎమెసిస్’ అనే సమస్యతో ఫైట్ చేశార‌ట‌. అయితే  అది శాస సంబంధిత వ్యాధి. అంతేకాక శ్వాస నాళముల వాపు చెందడంతో కొన్నాళ్ళు ‘ఐ.సి.యు’ లో కూడా జాయిన్ అయ్యారు. దీనికోసం ఆయ‌న ప్ర‌త్యేకంగా సింగపూర్ వెళ్ళి మ‌రీ ట్రీట్మెంట్ తీసుకున్నారు.

 

అప్పట్లో ఇలియానా కూడా ‘బాడీ డిస్ మార్ఫిక్ డిసార్డర్ ‘ కి గురయ్యిందట. దాంతో పూర్తి డిప్ర‌ష‌న్ లోకి వెళ్ళి ఒక దశలో ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. తన బాడీ షేప్ పై కొందరు కామెంట్స్ చేయడంతో.. ఇలాంటి నిర్ణయానికి పడిపోయిందట. అయితే తనకు తనే ధైర్యం తెచ్చుకుని ఈ సమస్య నుండీ బయట పడిందట. దాంతో వైద్య నిపుణుల సందేశాలు క్రమంగా ఫాలో అయ్యి తన డిసార్డర్ నుండీ బయటపడిందట.

 

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన స్నేహా ఉల్లాల్ కూడా ‘ఆటో ఇమ్యూన్ డిసార్డర్’ తో వ‌చ్చిందట.  రక్తానికి సంబందించిన ఒక వ్యాధ‌ని వైధ్యులు తెలిపారు. దీని వలన తన రోగ నిరోధక శక్తి లోభించిందని తెలిపింది. దీని వలనే ఇండస్ట్రీకి దూరమయ్యి ప్రస్తుతం ట్రీట్మెంట్ ప్ర‌స్తుతం తీసుకుంటుంది.

 

ఇక ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార కూడా ‘స్కిన్ డిసార్డర్’ తో బాధపడుతున్నారట. మేకప్ లు వేసుకోవడం వల్ల ఆమెకు ఈ డిజార్డర్ వ‌చ్చింద‌ని స‌మాచారం. అందులోనూ ముఖ్యంగా నాన్ వెజ్ తింటే ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుందట. దీనికోసం కేరళ వైద్యం, అలాగే ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ట‌.

 

టాలీవుడ్ టాప్ హీరోయ‌న్ అక్కినేని వారి కోడలు సమంత ‘పాలిమార్ఫస్ కాంతి విస్ఫోటనం’ తో బాధపడుతుందట. ఎండలో కాసేపు ఉంటే.. తన చర్మం ఎర్రబడిపోవడంతో పాటూ దురదలు కూడా మొదలవుతాయ‌ట. బాగా రంగు ఉన్నవారికైతే ఇది మరింత బాదిస్తుందట. దీని కోసం సమంత ఎక్కువగా ఎండలో వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటుందని… షూటింగ్ సమయంలో ఈ పరిస్థితి రాకుండా దర్శక నిర్మాతలతో ముందుగానే చెబుతుందట.

 

ఇక బాలీవుడ్ బ్యూటీ చేసుకున్న దీపికా పదుకొనె కూడా గతంలో డిప్రెషన్ కి గురయ్యిందట. ఈ వ్యాధి తో… ఎన్నో సమస్యలు ఎదుర్కొని.. చాలా ఒడుదుడుకుల‌కు లోన‌యింద‌ట‌. చివరికి మంచి స్థాయిలో నిలబడింది దీపికా. తన లాగే ఇలా డిప్రెషన్ గురయ్యే వారికోసం ప్రత్యేకంగా ఓ మెడికల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: