టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరో విశ్వక్‌ సేన్‌ ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ సమయం విడుదల టైములో చాలా దూకుడుగా తన స్వభావాన్ని చూపించడంతో విశ్వక్‌ సేన్‌ కి మంచి టెంపర్ ఉందని అప్పట్లోనే అందరికీ అర్థమైంది. తన పోస్టర్ నీ కావాలని కొంతమంది హీరోలు చేంజ్ చేయడం జరిగిందని నానా హడావిడి చేశారు ఆ టైములో. మీడియా ముందు భయంకరమైన ఆవేశంగా మాట్లాడటం తో పాటుగా కొన్ని పదాలు నోరు జారాడు. ఇదిలా ఉండగా తాజాగా కరోనా వైరస్ విపత్కర సమయంలో అందరూ లాక్ డౌన్ పాటిస్తుంటే కొందరు రోడ్లపైకి రావడం పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు రోడ్లపై ఏంటి మీ ఉప్పర్ మీటింగ్ ఏంటి అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియో ని పోస్ట్ చేయటంతో ఆ వీడియో వైరల్ అయింది. కాగా ఈ వీడియోలో విశ్వక్‌ సేన్‌ ఉప్పర్‌ అనే పదజాలం వాడటం తో...ఉప్పర్‌ కమ్యూనిటీకి చెందిన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో...విశ్వక్‌ సేన్‌ తన ఉద్దేశం అది కాదండీ మనోభావాలు దెబ్బ తీయటం కోసం కాదు ఆవేశంలో అన్నట్లు క్షమాపణలు చెప్పాడు.

 

అయితే తాజాగా మరోసారి క్షమాపణలు చెప్పాల్సిన టైం వచ్చినట్లు కొంతమంది విశ్వక్‌ సేన్‌ పై నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. అదేమిటంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ఎఫ్‌ 2’ సినిమా గురించి నోరు జారటం జరిగింది. అదేమిటంటే ‘ఎఫ్‌ 2’ సినిమా ఎలా హిట్ అయిందా నాకు అర్థం కావడం లేదని...సినిమా పావుగంట చూడగానే తలపోటు వచ్చేసిందని...అటువంటి సినిమా కమర్షియల్ హిట్ అవటం నాకే ఆశ్చర్యం కలిగింది అని అన్నట్టుగా తన అసహనాన్ని మీడియా ముందు వ్యక్తం చేశాడు.

 

అంతేకాకుండా 'ఎఫ్‌ 2'వంటి బూతు కామెడీ ఉన్న సినిమాలు ఎలా కమర్షియల్‌ సినిమాలు అవుతాయి అంటూ ప్రశ్నించాడు. దర్శకుడు అనీల్‌ రావిపూడిపై కూడా విశ్వక్‌సేన్‌ విమర్శలు చేశాడు. దీంతో మెగా అభిమానులు, వెంకటేష్ అభిమానులు అదేవిధంగా అనిల్ రావిపూడి అభిమానులంతా విశ్వక్‌ సేన్‌పై సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. విశ్వక్‌ సేన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జనాల దృష్టిలో హిట్ అయిన సినిమాని ప్లాప్ అని చెప్పటం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో విశ్వక్‌ సేన్‌ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. దీంతో గొడవ పెద్దది కావడంతో విశ్వక్‌ సేన్‌ అభిమానులు సోషల్ మీడియా లో ఎందుకయ్యా తెల్లారితే వివాదాలలో పడతావు అని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: