ప్రేక్ష‌కులు సినీ తార‌ల‌ను ప్ర‌త్యేక్షంగా తార‌ల్లా చూస్తుంటారు. అతిలోక సుంద‌రుల్లాగా చూస్తుంటారు. నిజ జీవితంలో వారు ఎలా ఉంటారో ఎలా మాట్లాడ‌తారో అని తెగ త‌హ‌త‌హ‌లాడిపోతుంటారు అభిమానులు. ఇక చూడ‌టం మాట్లాడ‌టం వ‌ర‌కైతే ప‌ర్లేదు. కానీ మాటేసి మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తేనే క‌దా వ‌చ్చేది అస‌లు ఇబ్బంది. అది మ‌గ‌వాళ్ళ‌తో అయితే ప‌ర్వాలేదు. ఆడ‌వాళ్ళ‌తో అయితే చెప్పుకోవ‌డానికే అస‌హ్యంగా అనిపిస్తుంది. అబ్బో స్టార్స్ అనుకుంటారు కానీ హీరోయిన్ల‌కు ఉండే ఇబ్బందులు అంతా ఇంతా కాద‌నే చెప్పాలి. ఒంట‌రిగా జ‌నాల్లో చిక్కారా ఇక అంతేప‌ని క‌నిపిస్తే చాలు అందిన చోట‌ల్లా తాకుతూ వికృతంగా ప్ర‌వ‌ర్తించిన వారు లేక‌పోలేదు. ఎంత‌మంది బౌన్స‌ర్స్‌తో వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ దృష్టితో ఉన్న‌వాడి క‌ళ్ళుగ‌ప్పి బ‌య‌ట ప‌డ‌టం సాధ్యం కావ‌డం లేదు. అలా లైంగిక దాడికి ఇబ్బంది ప‌డిన వారిలో  మ‌న హీరోయిన్స్ కెమెరాకు చిక్కిన వారు కొంత మంది ఉన్నారు ఇంక దొర‌క‌ని వారు ఎంత‌మంది ఉన్నారో. ఇక కొంత మంది అభిమానుల్ని తోసేస్తారు అంటారు కొంత మంది. ఎందుకు ఈ హీరోయిన్స్ బౌన్స‌ర్స్‌ని పెట్టుకుని బ్ర‌త‌కాల్సి వ‌స్తుంది.  అలా ఇబ్బందిప‌డిన వారు ఎవ‌రో చూద్దాం...

 

మొద‌ట‌గా జ్యోతిక అభిమానులు ఎక్కువ‌గా ఉండ‌గా ఓసారి చెన్నైలో థియేట‌ర్ కి వెళితే అభిమానులు మీది మీదికి వ‌చ్చేశారు. జ్యోతిక‌తో చాలా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు ఇది కెమెరా క‌ళ్ళ‌కు చిక్కింది. ఇక రెండో హీరోయిన్ స‌మంత. ఓ సారి ఓసారి తిరుప‌తిలో ఓపెనింగ్ కి వెళ్ళిన‌ప్పుడు అభిమానులు ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డారు. అందులో ఒక‌డు స‌మంత‌తో అస‌భ్యంగా ప్ర‌వర్తించాడు. కాని స‌మంత ఏ ఎక్స్‌ప్రెష‌న్ ఇవ్వ‌కుండా ఏమీ చెయ్య‌లేక నిర్వాహ‌కుల మీద లోప‌లికి వ‌చ్చి చాలా సీరియ‌స్ అయిపోయింది. ఆ త‌ర్వాత నుంచి ఎన్నో జాగ్ర‌త్త‌ల‌తోనే బ‌య‌ట‌కు వ‌చ్చింది స‌మంత‌. జ‌య‌మాలిని గ‌తంలో ఓ సినిమా షూటింగ్ చేస్తుంటే రాత్రి వేళ రోడ్డు మీద జ‌నాలంద‌రూ ఒక్క‌సారిగా జ‌య‌మాలిని మీద ఎగ‌బ‌డిపోయారు. దొరికిన‌కాడికి దొరికిన‌ట్టు తాకుతూ ఆఖ‌రికి ఆమె ఒంటిమీద బ‌ట్ట‌లు కూడా చించేశారు. పాపం త‌ట్టుకోలేక భ‌య‌ప‌డిపోయి చేతుల‌తో ఒళ్ళంతా క‌ప్పుకుని కుప్ప‌కూలిపోయింది జ‌య‌మాలిని. 

 

కాజ‌ల్ చెన్నైలో ఓ మాల్ ఓపెనింగ్‌కి వెళ్ళినప్పుడు ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు జ‌నాల్లోనుంచి కాజ‌ల్ న‌డుము నొక్కుతూ ఉన్నారు. దాంతో కాజ‌ల్ అక్క‌డే సీరియ‌స్ అయిపోయింది. కానీ మ‌నిషి మాత్రం ఎవ్వ‌రో తెలియ‌లేదు. ఇది కూడా కెమెరాకు చిక్కింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ ముంబ‌యిలో బాలీవుడ్ సినిమా ప్రమోష‌న్ కోసం వెళ్ళినప్పుడు క‌త్రినాతో అయితే ఎంత అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాలో అంత అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేశారు ఫ్యాన్స్ ఎక్క‌డెక్క‌డో తాకారు. ఆ నిముషం ఎలాగోలా బ‌య‌ట‌కు వ‌చ్చింది కానీ.. ఆ త‌ర్వాత నుంచి ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆమె బౌన్స‌ర్స్ కోసం చేసే ఖ‌ర్చే మూడునాలుగు ల‌క్ష‌లు అవుతుంద‌ట‌. ఆ త‌ర్వాత న‌గ్మా కాంగ్రెస్ త‌రుపు నుంచి ప్ర‌చారం చేస్తూ అభిమానులు అడిగారు క‌దా అని చెయ్యిస్తే ఏకంగా ఈమె చెయ్య‌ప‌ట్టుకుని లాగేస‌రిగి జ‌నాల్లోకి ప‌డిపోయింది న‌గ్మా. ఇక పోలీసులు వ‌చ్చి కాపాడేస‌రికి త‌ల‌ప్రాణం తోక‌కి వ‌చ్చిన‌ట్లు అయింది న‌గ్మా ప‌రిస్తితి. శృతిహాస‌న్ అభిమానిని అని చెప్పి ఇంటికి వ‌చ్చి ఏకంగా రేప్ చెయ్య‌బోయాడు ఓ అభిమాని. దీంతో శృతిహాస‌న్ తేరుకుని చిత‌కొట్టి పంపించేసింది ఇంట్లోంచి. ఇలాంటి సెక్స్‌వ‌ల్ హెరాస్‌మెంట్‌ని ఎదుర్కొన్న హీరోయిన్లు చాలా మందే ఉన్నార‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: