స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలోనే ‘అల వైకుంఠపురం లో’ సినిమాతో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేసుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ టైం బన్నీ పక్కన రష్మిక మందన నటిస్తుంది. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఫస్ట్ టైం లారీ డ్రైవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ నటించబోతున్నట్లు సమాచారం.

 

అంతేకాకుండా ఈ సినిమాలో ఫన్నీ చిత్తూరు యాసలో డైలాగులు చెప్పబోతున్నాడు అంటూ టాక్. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం కాగానే ఫస్ట్ షెడ్యూల్ అల్లు అర్జున్ లేకుండా కంప్లీట్ చేశాడు సుకుమార్. ఇదిలా ఉండగా రెండో షెడ్యూల్ ప్రారంభం కావాల్సిన సమయంలో కరోనా వైరస్ వల్ల సినిమా షూటింగ్ లన్ని ఆగిపోవడంతో...బన్నీ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ లో పాల్గొనలేదు.

 

ఇలా ఉండగా టైటిల్ ఫార్ములా విషయంలో బన్నీ - సుకుమార్ టాప్ ట్రెండ్ సృష్టించే విధంగా పాతకాలం సెంటిమెంట్ ని నమ్ముకుని రెండక్షరాల టైటిల్ ని పెట్టాలని ఇద్దరు ఆలోచిస్తున్నట్లు సమాచారం. 8వ తారీకున అల్లు అర్జున్ పుట్టిన రోజు నేపథ్యంలో సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అల్లు అర్జున్ కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడానికి సుకుమార్ రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: