ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ తో బాహుబలి రెండు భాగాల సినిమాలు తీసి అత్యద్భుత విజయాలు అందుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇటీవల ఈ సినిమాకు రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సినిమా యూనిట్, సినిమా యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో ని ఇటీవల ఆయన జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2021, జనవరి 8 న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ గా రిలీజ్ కానున్న ఈ సినిమా మొన్నటి వరకు శరవేగంగా జరిగింది. 

 

అయితే కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వలన పలు దేశాలతో పాటు మన దేశం కూడా 21 రోజులపాటు లాకౌట్ అవడం తో షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. అయితే ఈ లాకౌట్ కేవలం ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే కాక, మరొక 15 నుండి 20 రోజులపాటు పొడిగించే అవకాశం ఉందని కేంద్రం నుండి సమాచారం ఉందని అంటున్నారు. అయితే దీనిపై ఎక్కడా కూడా ఇప్పటివరకు అధికారిక సమాచారం లేనప్పటికీ ఒకవేళ ఇదా కనుక జరిగి, సినిమా షూటింగ్స్ మరొక నెలరోజుల పాటు వాయిదా పడితే మాత్రం అది ఆర్ఆర్ఆర్ కు పెను ముప్పుగా మారనుందని, దానివలన పలువురు నటీనటుల కాల్ షీట్స్ వేస్ట్ అవడంతో పాటు సినిమాని అనుకున్న సమయానికి రిలీజ్ చేసే అవకాశం ఉండదని రాజమౌళి ఆందోళన పడుతున్నారట. 

 

అయితే ఒకవేళ ఇదే కనుక నిజమై షూటింగ్స్ మరొక నెల రోజులు వాయిదా పడితే మాత్రం తప్పకుండా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మరొక్కసారి వాయిదాపడినా పడొచ్చని అంటున్నారు. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ ఇదేకానుక నిజమై, సినిమా షూటింగ్స్  మరికొన్ని రోజులు వాయిదా పడితే మాత్రం, ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతుందేమో అని పలువురు ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: