టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ముందుగా అక్కడక్కడా కొన్ని సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసి, ఆపై హీరోగా మారిన మోహన్ బాబు, అదిరిపోయే రేంజ్ లో డైలాగ్స్ చెప్పడంతో పాటు తన మెస్మరైజింగ్ యాక్షన్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఆయన నట వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మి మంచు ప్రస్తుతం సినిమాల్లో కొనసాగుతున్నారు. మోహన్ బాబు పెద్దకుమారుడైన విష్ణు, తొలుత టాలీవుడ్ కి విష్ణు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్న విష్ణు కెరీర్ లో ఢీ, దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద, దూసుకెళ్తా వంటి సినిమాలు మంచి హిట్ కొట్టడంతో పాటు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.  

 

ఫంక్షన్స్  వంటి వాటికి రావడం పెద్దగా అలవాటు లేని విష్ణు, ఎక్కువగా తన తండ్రి బిజినెస్ వ్యవహారాలతో పాటు మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఉంటారు. ఇక మీడియాకు కూడా పెద్దగా టచ్ లో ఉండని విష్ణు, ఇటీవల్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన లైఫ్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. తనకు ఎక్కువగా పబ్లిక్ ఫంక్షన్స్ లో మాట్లాడడం అలవాటు లేదని, తనకు జనం ఎక్కువగా ఉన్న ఫంక్షన్స్ లో మాట్లాడం అంటే కొంత లోలోపల భయం అని విష్ణు చెప్పారు. ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమాలో మరొక హీరో సునీల్ శెట్టి తో కలిసి నటిస్తున్న విష్ణు, తప్పకుండా ఆ సినిమా మంచి సక్సెస్ సాధించి తనకు నటుడిగా మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

 

తనకు ఇండస్ట్రీ లో నితిన్, కళ్యాణ్ రామ్, సుమంత్, గోపీచంద్ మంచి ఫ్రెండ్స్ అని అన్నారు. మరి వారితో మీకు ఒక్క మల్టీస్టారర్ సినిమా అయినా చేయాలని అనిపించలేదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన విష్ణు, తనకు నితిన్ తో మరింత ఎక్కువ చనువు ఉందని, అయితే అతడితో ఎప్పటినుండో మల్టిస్టారర్ చేద్దాం అనుకుంటే కుదరడం లేదని, అలానే ఇటీవల తాను నటించిన ఈడోరకం వాడోరకం సినిమాలో రాజ్ తరుణ్ ప్లేస్ లో మొదటగా కళ్యాణ్ రామ్ నటించాల్సిందని, అయితే కొన్ని కారణాల వలన అది కుదరలేదని అన్నారు. ఇక తన మరొక సినిమాలోని ఒక కీలక క్యారెక్టర్ లో సుమంత్ ని నటించమని అడుగగా తనకు క్యారెక్టర్ నచ్చలేదు, అందుకే నటించలేనని అన్నారని, ఆ విధంగా వారిద్దరూ నన్ను మోసం చేసారు, రాస్కెల్స్ అంటూ విష్ణు సరదాగా సమాధానం చెప్పడం జరిగింది....!!     

మరింత సమాచారం తెలుసుకోండి: