ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ లలో పూజా హెగ్డే ఒకరు. ఈ ఇయర్ ఆల్రెడీ అల వైకుంఠపురములో సూపర్ హిట్ అందుకున్న పూజా ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుంది. అందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా ఒకటి కాగా మరోటి అక్కినేని అఖిల్ హీరోగా చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ రెండు సినిమాల్లో పూజాకి మంచి రోల్స్ పడ్డాయని తెలుస్తుంది. ముఖ్యంగా అఖిల్ సినిమాలో బుట్ట బొమ్మ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. 

 

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ పాత్రకు సమానంగా పూజా హెగ్డే రోల్ ఉంటుందట. పూజా హెగ్డే ఈమధ్య చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఆ లక్ ఫేవర్ కాస్త అఖిల్ కు కలిసి వస్తుందని అంటున్నారు. అంతేకాదు కేవలం అందంతోనే కాదు అభినయంతో కూడా తాను మెప్పించగలను అనేలా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది అమ్మడు. కరెక్ట్ టైం కు అఖిల్ ఆఫర్ రావడం అమ్మడు ఓకే చెప్పడం అంతా అలా జరిగిపోయింది. ఈ సినిమాతో పూజా హెగ్డే మరో యాంగిల్ తెలుస్తుందని అంటున్నారు. 

 

అందుకే బొమ్మరిల్లు భాస్కర్ పూజా హెగ్డే ని ఫుల్లుగా వాడేస్తున్నారట. ప్రభాస్ సినిమా కూడా లవ్ స్టోరీ గా వస్తుందని తెలుస్తుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అఖిల్ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమా లతో పూజా హెగ్డే కెరియర్ మరింత స్ట్రాంగ్ గా మారనుంది. అఖిల్ సినిమా ఈ ఇయర్ వస్తుంది కాని ప్రభాస్ సినిమా కష్టమే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: