టాలీవుడ్ లో చాలా మంది వచ్చి రాగానే ఒక సూపర్ హిట్ ని అందుకుంటారు. అంతే ఇక వరసగా సినిమాలొస్తాయి అనుకుంటారు. అనుకున్నట్టుగానే కొంతమందికి ఆఫర్ వచ్చి ఒళ్ళో పడతాయి. కాని హిట్ అవ్వవు. దాంతో ఇక మొదలు కథ. హిట్ కోసం పడని పాట్లు ఉండవు. ఈ లోగా ఎవరో ఒకరు స్టార్ హీరోల సినిమాలో ఐటం సాంగ్ చేయమనో లేదా గెస్ట్ రోల్ చేయమనో అడుగుతారు. అవి చేస్తే ఆ తర్వాత వాళ్ళ సినిమాలలో ఛాన్స్ ఇస్తారన్న ఆశతో ఒప్పుకుంటారు. ఐటం సాంగ్ లో అంగాంగ ప్రదర్శన చేస్తారు. కాని అప్పుడేమీ అర్థం కాకపోయినా ఆ తర్వాత మమ్మలిని  వాడేసుకున్నారు ఆడేసుకున్నారు అంటూ వాపోతుంటారు. ఇప్పుడు బ్యూటి ఫుల్ హీరోయిన్ సీరత్ కపూర్ పరిస్థితి అలానే ఉంది.

 

2014 సంవత్సరంలో శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాలో శర్వానంద్ కి జంటగా సీరత్ కపూర్ నటించింది. ఈ సినిమా సీరత్ కి మంచి హిట్ ఇచ్చింది. దాంతో ఆ తర్వాత సందీప్ కిషన్ టైగర్, కొలంబస్, నాగార్జున నటించిన రాజు గారి గది 2, రవితేజ టచ్ చేసి చూడు, ఒక్క క్షణం, వంటి సినిమాలలో నటించింది. వీటిలో కొన్ని సినిమాలు బాగా ఆకట్టుకున్నప్పటికి సీరత్ కి మాత్రం క్రేజ్ రాలేదు. అందం అభినయం రెండింట్లో సీరత్ కి బాగా ఫాలోయింగ్ ఉంది. కాని మేకర్సే పట్టించుకోవడం లేదు. 

 

ఇక సినిమాల పరంగా అవకాశాలు లేక పోయినప్పటికీ సీరత్ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులని హీటెక్కిస్తుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ ని రెట్టింపు చేస్తూ కొత్త కొత్త ఫొటోలని పోస్ట్ చేస్తుంది. ఒకరకంగా ఇది జనాలకంటే మేకర్స్ కోసమే అన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సీరత్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న 'కృష్ణ అండ్ హిస్ లీల'  సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సీరత్ ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది. మరి ఈ సినిమా ఒక మోస్తారు గా ఆడితే సీరత్ ని ఎవరన్న పట్టించుకుంటారు. లేదంటే ఇక సర్ధుకొని ఇంటికెళ్ళాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి: