కరోనా విజృంభిస్తున్న వేళ ఈ మహమ్మారి నుంచి ప్రజానీకాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అంధిస్తుండగా, మరికొందరు ప్రజల్లో అవేర్‌నెస్ కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే బాటలో తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి నాగార్జున, యంగ్ హీరోలు వరుణ్ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లతో కలిసి ఓ పాటను రూపొందించారు.

 

సంగీత దర్శకుడు కోటి రూపొందించిన ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే సమయంలో అందరినీ ఆలోచింప చేసేదిగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పాటను రూపొందించినందకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు స్టార్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

 

ఆయన సోషల్‌ మీడియా పేజ్‌లో తెలుగులో ట్వీట్ చేస్తూ `చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.` అంటూ ట్వీట్ చేశాడు.

 

ప్రస్తుతం భారత్‌లోనూ కరోనా ప్రభావం తీవ్రంగానే ఉన్న ఇప్పటికే 2000లకు పైగా కేసులు నమోదు కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి మరింతగా విజృభిస్తోంది. ఢిల్లీ జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వారికి పెద్ద సంఖ్యలో కరోనా సోకింది. ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు తప్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: