ఈనెల 14వ తారీఖు నుండి అన్నీ అనుకూలిస్తే కేవలం దశలవారీగా లాక్ డౌన్ తొలగిస్తారు తప్ప పూర్తిగా ఇండియా అంతటా లాక్ డౌన్ ఎత్తివేసే సూచనలు కనిపించడం లేదు. దీనితో సినిమా ధియేటర్స్ అదేవిధంగా సినిమా షూటింగ్ లు ఈనెల అంతా కూడ బ్రేక్ పడే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో మే నెల నుంచి మాత్రమే ధియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మే నెలలో సినిమా ధియేటర్స్ ఓపెన్ అయినా పెద్ద హీరోల సినిమాలు ఏవీ వచ్చే ఆస్కారం లేదు. 

 

మే నెలలో రావలసి ఉన్న పవన్ ‘వకీల్ సాబ్’ కు ఇంకా 40 రోజులు వర్క్ మిగిలి ఉంది అని అంటున్నారు. ఆగష్టులో విడుదల చేయాలి అని ప్రయత్నిస్తున్న చిరంజీవి కొరటాల మూవీకి కూడ దాదాపు 60 రోజుల పని మిగిలి ఉంది అని అంటున్నారు. ఈరెండు సినిమాలతో పాటు వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ సగం మాత్రమే పూర్తి అయింది అని అంటున్నారు. ఇక బోయపాటి బాలయ్యల మూవీ కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది. 

 

ఇలాంటి పరిస్థితులలో సమ్మర్ కు కేవలం మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు మాత్రమే హడావిడి చేసే ఆస్కారం కనిపిస్తోంది. నాని ‘వి’ సినిమా విడుదలకు రెడీగా ఉంటే రామ్ ‘రెడ్’ దాదాపు పూర్తి అయింది. అదేవిధంగా రవితేజ ‘క్రేక్’ కూడ దాదాపు పూర్తయిపోయింది. దీనికితోడు శర్వానంద్ ‘శ్రీకారం’ నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ తో పాటు కొన్ని చిన్న సినిమాలు మాత్రమే మే జూన్ నెలలో వచ్చే ఆస్కారం ఉంది. దీనితో టాప్ హీరోలు సినిమాలకు సంబంధించి దసరా సీజన్ మాత్రమే మిగిలి ఉంది. 

 

ఈ పరిస్థితులలో రాబోతున్న దసరా సీజన్ కు రావాలని ప్రభాస్ చిరంజీవి వెంకటేష్ లు ప్రయత్నిస్తున్నారు. దీనికితోడు ‘వకీల్ సాబ్’ కు సమ్మర్ సీజన్ మిస్ కావడంతో ఈ మూవీని కుదిరితే ఆగస్టు 14న అప్పటికీ కుదరకపోతే దసరా రేసులో దింపాలని దిల్ రాజ్ భావిస్తున్నాడు. అయితే ఇదే దసరా రేస్ కు తాము వస్తున్నట్లుగా ‘కేజీ ఎఫ్ 2’ నిర్మాతలు ప్రకటించడంతో ఈసారి దసరా రేస్ సంక్రాంతి రేస్ మించి ఉండబోతోంది. దీనితో ధియేటర్ల గిల్డ్ పై పట్టు ఉన్న వాళ్ళ సినిమాలకు మంచి డేట్ లు దొరకుతాయి అంటూ ఇంకా లాక్ డౌన్ పూర్తిగా ముగియకుండానే దసరా రేస్ పై ఆసక్తికర ఊహాగానాలు మొదలయ్యాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: