కరోనా వల్ల షూటింగ్ లకు గ్యాప్ ఏర్పడటంతో రాజమౌళి తనకు వచ్చిన ఈ గ్యాప్ ను కేవలం తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి క్లైమాక్స్ ఎలా తీయాలి అనే విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చాలలోతుగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చరిత్రలో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ లు వారు జీవించి ఉన్న కాలంలో ఒకరికొకరు ఎదురుపడిన సందర్భాలు గురించి చారిత్రిక ఆధారాలు లేవు.


అయితే వీరిద్దరు ఎదురుపడితే వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అన్న ఒక చిన్న ఊహ పై ఈ కథను అల్లారు. అయితే రాజమౌళి ఎన్ని ఊహలు చేసినప్పటికి అల్లూరి కొమరం భీమ్ ల పాత్రల చారిత్రిక నేపద్యం రీత్యా వారిద్దరూ స్వాతంత్రపోరాటంలో చనిపోయినట్లు చూపించి తీరాలి. అయితే అలా జూనియర్ చరణ్ లు చనిపోయినట్లు చూపిస్తే ఎంతవరకు అభిమానులు అంగీకరిస్తారు అన్న సందేహాలు రాజమౌళికి వచ్చినట్లు తెలుస్తోంది. 


తెలుస్తున్న సమాచారం మేరకు విజయేంద్ర ప్రసాద్మూవీ కథను ట్రాజిడీ గా ముగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగింపు రాజమౌళికి ఏమాత్రం నచ్చక పోవడంతో ఈ మూవీ క్లైమాక్స్ ను మార్చే ప్రయత్నాలు జక్కన్న చేస్తున్నట్లు టాక్. ఈ మధ్య విడుదలైన రామ్ చరణ్ ఇంట్రో వీడియో లో 'అల్లూరి సీతారామరాజు'గా చరణ్ ని పోలీస్ గెటప్ లో పరిచయం చేసిన విషయం తెలిసిందే. యూనిఫార్మ్ లో మీసం తిప్పుతున్న రామ్ చరణ్ చొక్కాలేకుండా పోలీస్ బెల్ట్ ప్యాంటు ధరించి ఉన్న సీన్స్ ఉన్నాయి. 


ఈ వీడియో తరువాత ఈ మూవీలో కల్పితం ఎక్కువే అనే విషయం అర్థం అవుతున్నాయి. దీనితో ఈ మూవీ క్లైమాక్స్ లో కూడ వాస్తవాలకంటే కల్పితాలే ఎక్కువగా ఉండవచ్చు అన్న సూచనలు వస్తున్నాయి. అయితే తాను వ్రాసిన కథ విషయంలో మార్పులు చేయడానికి రాజమౌళి చెప్పినా పెద్దగా అంగీకరించని విజయేంద్ర ప్రసాద్ ను ఈ మూవీ క్లైమాక్స్ విషయంలో మార్పులకు ఎలా ఒప్పిస్తాడు అన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: