దర్శకధీరుడు రాజమౌళి మంచి నటుడు కూడానా.. అదేంటి ఆయన నటుడైతే సినిమాల్లో కనిపించాలి కదా.. తన సినిమాల్లో ఏదో అలా మెరుపులా కనిపించే జక్కన్న మంచి రోల్ రాసుకోవచ్చు కదా అనుకోవచ్చు. రాజమౌళి మంచి నటుడే కాని ఆయన నటించేది స్క్రీన్ మీద కాదు ప్రమోషన్స్ లో అంటున్నాడు. సినిమాలో సీన్ చెబుతున్నప్పుడు సాధారణంగా దర్శకులే ఆ సన్నివేశాన్ని ముందు తాము నటించి హీరో హీరోయిన్స్ కు చూపిస్తారు. అయితే అలాంటి టైంలో దర్శకుడిలోని నటన బయటపడుతుంది. 

 

అయితే రాజమౌళి ఏకంగా తానూ మంచి నటుడని నిజాన్ని ఒప్పుకున్నాడు. తాను సినిమా చేసేప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నా రిలీజ్ ముందు వచ్చే టెన్షన్ కనిపించకుండా రాజమౌళి నటిస్తాడట. అది తనకు మాత్రమే తెలుసని అంటున్నాడు జక్కన్న. రాజమౌళి సినిమా అంటే మామూలుగానే భారీ స్థాయిలో ఉంటుందని తెలిసిందే. అలాంటి టైం లో టెన్షన్ కామనే.. అయితే టెన్షన్ అంటా రాజమౌళి తీసుకుని ప్రేక్షకులకు మాత్రం మంచి సినిమాను అందిస్తున్నాడు.

 

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. రీసెంట్ గా సినిమా నుండి వచ్చిన అల్లూరి టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. తప్పకుండా ఆర్.ఆర్.ఆర్ మరో బాహుబలి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు జక్కన్న. ఇప్పటికే టీజర్ చూసి బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్కడ మేకర్స్ కూడా ఆర్.ఆర్.ఆర్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: