ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రోజు రోజూ ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తూ వేలాది మందిని బలితీసుకుంటోంది. అగ్రరాజ్యాలు సైతం మహమ్మారి ప్రభావంతో అతలాకుతలమవుతున్నాయి.  ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 59,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 6,000 మంది మృతిచెందారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధమవుతోంది. ముఖ్యంగా ఐరోపాలోని ఇటలీ, స్పెయిన్‌లో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. 

 

ఇటలీలో అయితే కరోనా మరణాలు ఆగడం లేదు. ఇక కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ప్రపంచంలోని సగం దేశాలలో లాక్‌డౌన్ అమలవుతోంది. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్యులు సైతం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే..  తమిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి లాక్‌డౌన్‌ను బ్రేక్ చేశారు. లాక్‌డౌన్ బ్రేక్ చేసినా.. తాను రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను  హీరో అని నిరూపించుకున్నాడు. అస‌లు విష‌యంలోకి వెళ్తే..  సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, ర‌చ‌య‌త నెల్లాయ్ భార‌తి మ‌ర‌ణించారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న శుక్ర‌వారం క‌న్నుమూశారు. 

 

ఇక అంత్య‌క్రియ‌ల కోసం భార‌తి భౌతిక‌ఖాయాన్ని పోరూర్ లోని ఆయ‌న ఇంటికి త‌ర‌లించారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతుండ‌డంతో అతి తక్కువ‌మంది స్నేహితులు, స‌న్నిహితులు హాజ‌రై భార‌తికి తుది వీడ్కోలు ప‌లికారు. అయితే భార‌తి.. అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతో తమిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి సైతం అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నాడు. కుటుంబానికి ఆర్థిక‌సాయం చేయడంతో పాటు అంత్య‌క్రియ‌ల ఖ‌ర్చును కూడా ఆయ‌నే పెట్టుకున్నారు. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ ఉన్నా కూడా రిస్క్ తీసుకుని విజ‌య్ అక్క‌డ‌కు వెళ్లి సాయం చేయ‌డంతో ప‌లువురు ఆయ‌న్ను శ‌భాష్ అని మెచ్చుకుంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


  

మరింత సమాచారం తెలుసుకోండి: