దర్శకుడు సుకుమార్ త్వరలో అల్లు అర్జున్ తో మొదలుపెట్టబోతున్న లేటెస్ట్ మూవీలో తాను గతంలో ‘రంగస్థలం’ మూవీలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకూడదు అని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ ‘రంగస్థలం’ మూవీలో డీ గ్లామర్ పాత్ర చేసినప్పటికీ అతని గెడ్డం ఆ పాత్రకు సంబంధించి సహజంగా కనిపించకుండా గుబురు గెడ్డం అయినప్పటికీ కొంత స్టైలిష్ గా కనిపించింది అన్న విమర్శలు వచ్చాయి. 


ఈ విమర్శలు సుకుమార్ దృష్టి వరకు రావడంతో త్వరలో బన్నీ తో మొదలుపెట్టబోతున్న తన లేటెస్ట్ మూవీలో అలాంటి పొరపాట్లు మళ్ళీ జరగ కూడదని సుకుమార్ ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ తో అల్లు అర్జున్ చేయబోతున్న మూవీలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రను చేస్తున్న పరిస్థితులలో ఆ పాత్రకు తగ్గట్టుగా బన్నీ మోటుగా కనిపించే విధంగా గెడ్డం పెంచడమే కాకుండా ఆ గెడ్డం చాల గలీజ్ గా కనిపించే విధంగా బన్నీ లుక్ ఉండాలని దీనికోసం ఎటువంటి స్టైలిస్టుల సలహాలు తీసుకోవద్దని సుకుమార్ ఇప్పటికే బన్నీ కి స్పష్టంగా చెప్పాడు అని టాక్. 


దీనితో అల్లు అర్జున్ తన పాత్ర లుక్ కు సంబంధించి ఎటువంటి స్టైలిస్టుల సహకారం తీసుకోకుండా సహజంగా చాల మోటుగా కనిపించడానికి బన్నీ మానసికంగా సిద్ధ పడుతున్నట్లు సమాచారం. దీనికితోడు ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్రకు కేవలం రెండు లుంగీలు మాత్రమే వాడుతారని ఆ లుంగీలు కూడ బాగా మాసిపోయి నలిగిపోయినట్లు ఉండే విధంగా సుకుమార్ బన్నీ పాత్రను డిజైన్ చేస్తున్నట్లు టాక్.


అయితే ఇప్పటి వరకు బన్నీ నటించిన అన్ని సినిమాలలోను చాల స్టైలిస్ట్ గా కనిపించాడు. అందుకే అతడి అభిమానులు స్టైలిస్ట్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇలాంటి పరిస్థితులలో ఇంత సహజత్వంతో కూడిన లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ కష్టపడి నటించినా సగటు ప్రేక్షకుడు ఆదరిస్తారా అన్న సందేహాలు బన్నీ అభిమానులను వెంటాడుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: