దేశాన్ని కరోనా మేఘాలు దట్టంగా కమ్మేస్తున్న పరిస్థితులలో నిన్న ఒక్కరోజే భారత్ లో 500 లకు పైగా కొత్త కేసులు బయటపడటంతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య 3వేలను దాటిపోయింది. ఇక అభివృద్ధి విషయంలో పోటీ పడవలసిన తెలుగురాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల విషయంలో పోటీ పడుతున్న పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో కూడ కరోనా సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. 


ఇలాంటి పరిస్థితులలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసమస్యను అడ్డుకోవడంలో ప్రభుత్వాల నుండి ప్రజల వరకు రకరకాల కారణాలతో విఫలం అవుతున్నా పరిస్థితులతో అందరు పోరాటం చేస్తున్నారు. ఈనేపధ్యంలో కరోనా పై సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన పాటకు అనూహ్య స్పందన వస్తోంది. 


కోటి స్వరపరిచిన ఈ గీతంలో మెగాస్టార్ చిరంజీవి నాగార్జున సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లు నటించడంతో ఈ పాటకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ పాట ప్రధానమంత్రి దృష్టి వరకు వెళ్ళడమే కాకుండా ఆయన ప్రశంసలు చిరంజీవి నాగార్జున లకు రావడం షాకింగ్ న్యూస్ గా మారింది. ‘చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దామ' అని ప్రధాని మోడీ ట్విట్ చేసారు. 


ప్రధాని చేసిన ప్రశంసలు చిరంజీవి దృష్టి వరకు రావడంతో ‘మీ అమూల్యమైన ప్రశంసలకు ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారు.. కరోనా బారి నుంచి మన దేశాన్ని కాపాడేందుకు మీరు పడుతున్న శ్రమను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మేము మా తరుపున చేతనైన సాయాన్ని చేస్తున్నాము. సంగీత దర్శకుడు కోటీ గారు మా అందరి తరుపున మీకు నా ధన్యవాదాలు' అంటూ చిరంజీవి మోడీ ప్రశంసలకు రిటర్న్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు మోడీ నాగ్ చిరంజీవి లపై కురిపించిన ప్రశంసలు మెగా అక్కినేని అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారడంతో ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుతో రేపు రాత్రి విద్యుత్ దీపాలు ఆపి దీపాలు వెలిగించే కార్యక్రమంలో మన టాప్ హీరోల అభిమానులు అంతా చాల ఉత్సాహంగా పాల్గొనే ఆస్కారం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: