తెలుగు హీరోయిన్ అంజలి తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. పేరుకి తెలుగమ్మాయే అయినా తమిళ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అంజలి, అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం నిశ్శబ్దంలో నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం మరొకొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే అంజలిపై గత కొన్ని రోజులుగా రొజుకో వార్త వినిపిస్తుంది.

 

 

 

 

తమిళ నటుడు జైతో ప్రేమలో ఉందని అనేక కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి రెండు మూడు చిత్రాల్లో నటించేసరికి ఈ వార్తలు మరింత పెరిగాయి. అయితే అంజలి ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలని ఎవరూ ఖండించకపోవడంతో వారిద్దరి మధ్య ప్రేమ నిజమేనని అందరూ నమ్మారు. ఆ నమ్మకాన్ని మరింత పెంచడానికా అన్నట్టు అంజలి, జైలతో సినిమా నిర్మించిన నిర్మాత సైతం కొన్ని విషయాలని బయటపెట్టాడు.

 

 

 

నిర్మాత మాట్లాడుతూ అంజలి, జైలు ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరూ కలిసి షూటింగ్ ఎగ్గొట్టి బయట తిరిగేవారని, దానివల్ల తనకి బాగా లాస్ వచ్చిందని.. అంతేకాదు వీరిద్దరూ ఒకే రూమ్ లో గడిపారని కూడా తెలిపాడు. తాజాగా నిర్మాత మాటలకి స్పందించిన అంజలి నిర్మాత మాటలకి ఈ విధంగా సమాధానం ఇచ్చింది.

 

 

నేను అసలు ప్రేమలో లేను.. ఒకవేల ఎవరినైనా ప్రేమిస్తే దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంటుంది.. ధైర్యంగా చెప్పేస్తాను. ఒక రెండు సినిమాల్లో కలిసి నటించినంత మాత్రాన ప్రేమించుకుంటున్నాం అని డిసైడ్ అయితే ఎలా.. మీలా ఆలోచించే ఆ నిర్మాత కూడా అలామ్టి వ్యాఖ్యలు చేసుంటాడు. అంతే తప్ప తనకి, జై కీ మధ్య ప్రేమ లేదని చెప్పుకొచ్చింది. మొత్తానికి అంజలి నిర్మాతకి మంచి పంచే వేసింది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: