250 సినిమాలకు పైగా కధలు మాటలు రాసిన పరుచూరి గోపాల కృష్ణ టాప్ హీరోల సినిమాలకు సంబంధించి స్టార్ రైటర్ గా ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం దర్శకులే రచయితలుగా ద్విపాత్రాభినయం చేస్తున్న పరిస్థితులలో ఒక ప్పుడు ఒక వెలుగు వెలిగిన పరుచూరి హవా మసకబారింది.


దీనితో  ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్న పరుచూరి సొంతంగా ఒక వెబ్ ఛానల్ పెట్టుకుని ఆనాటితరం హీరోలు హీరోయిన్స్ గురించి అప్పటి సినిమాల గురించి అనేక ఆసక్తికర విషయాలు తన వెబ్ ఛానల్ ద్వారా తెలియచేస్తున్నారు. ఈనాడు ప్రముఖ పొలిటీషియన్ గా ఒకనాటి గ్లామర్ బ్యూటీగా ఒక వెలుగు వెలుగుతున్న రోజా కథానాయికగా నటించిన మొదటి సినిమా ‘ప్రేమ తపస్సు’. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ తో రోజా నటించింది.


అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడంతో  ఆ తర్వాత ఛాన్సులు లేక రోజా ఖాళీగా ఉందట. అదే సమయంలో పరుచూరి బ్రదర్స్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమా చేస్తున్నారట ఈ సినిమాలో శోభన్ బాబు కూతరు పాత్ర కోసం ముందుగా మీనాను అనుకుంటే అప్పటికే మీనా ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాతో మంచి ఫామ్‌ లోకి రావడంతో  ‘సర్పయాగం’ సినిమాలో శోభన్ బాబు కూతురు చనిపోయే పాత్ర కావడంతో ఆ పాత్రను తాను చేయనని అప్పట్లో రోజా రిజక్ట్ చేసిందట.


దీనితో శోభన్ బాబు కూతురు పాత్రకు ఎవరు చేస్తే సరిపోతుందా అన్న ఆలోచనలతో పరుచూరి బ్రదర్స్ అనుకోకుండా ‘ప్రేమ తపస్సు’ మూవీ చూడటం వెనువెంటనే రోజాను శోభన్ బాబు కూతురుగా ‘సర్పయాగం’ మూవీలో తీసుకోవడం ఆ మూవీ హిట్ కావడంతో అక్కడ నుండి రోజా దశ తిరిగింది అని అంటున్నాడు పరుచూరి. అక్కడ నుండి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ‘జబర్దస్త్’ కార్యక్రమానికి జడ్జి గా రోజుకు మూడు లక్షలు తీసుకునే స్థాయికి రోజా ఎదిగింది అంటే పరోక్షంగా అది మీనా చేసిన ఉపకారం అని అంటున్నాడు పరుచూరి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: