పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే ఎంతటి ఆసక్తి నెలకొంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పవన్ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వస్తుందా అని ఎదురుచూడటంలో ఫ్యాన్స్ కు మంచి కిక్కు ఉంటుంది. పవన్ స్టిల్ రిలీజ్ అయినా, టైటిల్ ఇదే అంటూ రూమర్స్ వచ్చినా, హీరోయిన్ గా ఓ పేరు రౌండ్ అయినా.. వైరల్ అయిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఇటువంటి ఓ అప్డేట్ టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది.

 

 

క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ కనిపించబోతోందని ఓ వార్త రౌండ్ అవుతోంది. పూజిత ఎవరని అప్పుడే పవన్ అభిమానులు గూగుల్ సెర్చ్ మొదలుపెట్టేశారు కూడా. ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంలో ఆది పినిశెట్టి లవర్ గా నటించింది. తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది కూడా. క్రిష్ ఈ ప్రపోజల్ ఆమె ముందు పెట్టగా వెంటనే ఓకే చేసిందని సమాచారం. పవన్ పక్కన ఓ సాంగ్ అయినా క్రేజ్ పక్కా అని ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమైందట.

 

 

నటన మీద ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగం కూడా వదులుకుంది ఈ భామ. ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత జరిగే షెడ్యూల్స్ లో పవన్ – పూజితలపై సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం వైరల్ అయిన ఈ న్యూస్ గురించి క్రిష్ గానీ టీమ్ నుంచి గానీ అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: