కరోనా నేపథ్యంలో దేశం గడ్డు పరిస్థితులలో మగ్గుతున్న వేళ, పలువురు సినీ ప్రముఖులు... నటులు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, జూనియర్ ఆర్టిస్టులు... ఇలా అనేక మంది దాతలుగా మారి, తోచినంతలో సినీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా... విరాళాలు ప్రకటిస్తున్నారు... ఒక్క క్రాఫ్ట్ తప్ప! వారే సినిమా హీరోయిన్లు... వివిధ రాష్ట్రాలనుండి వచ్చి, తెలుగు సినిమాలో పాగా వేసి, కోటాను కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటున్న వీళ్ళు.. ఆపద సమయంలో కనిపించకుండా పోతున్నారు.

 

ఇక ఈ విషయం పలువురు సినీ ప్రముఖులు విమర్శించినా... నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే వారి శైలి అందరికి చాలా క్లియర్ గా కనబడుతోంది. ఇలాంటి వాతావరణంలో.. యాంకర్ సుమ వివిధ రూపాలలో విరాళాలు ప్రకటించి, తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులలో వెండి తెర, బుల్లితెర కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.

 

వారి సంక్షేమమే ధ్యేయంగా... సుమ ఓ వినూత్న మార్గంలో వెళుతున్నారు... అదేమంటే... గత కొన్ని సంవత్సరాలుగా తన కింద పనిచేస్తున్న ప్రొడక్షన్ బాయ్స్, మేకప్, లైటింగ్ ఇలా వివిధ క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న వాళ్ల లిస్ట్ సేకరించి, వారికి డైరెక్టుగా సొమ్ము అందేలా... అంటే, నేరుగా వారి అకౌంట్లకే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మెచ్చి పలువురు నెటిజన్లు యాంకర్ సుమ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

ప్రస్తుత పరిస్థితిని గమనించి, మన తెలుగు తెర ముద్దు బిడ్డలు అయిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య, నాగార్జున, ప్రభాస్, మహేష్ ఇలా ఎంతో మంది హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు తమకు చేతనైన సాయం చేస్తున్న సంగతి తెలిసినదే. అలాగే... పేదలకు విరాళాలు సేకరించి  ఉచితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు, కొంత ఆర్థిక సాయాన్ని చేస్తున్న సంగతి తెలిసినదే.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: