ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. విభిన్న కథలతో ఎప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం అందించే డైరెక్టర్ క్రిష్… పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్  తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరిగింది. ఆమె ఎవరో కాదండి పూజిత పొన్నాడ.

 

భామ రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలంలో ఆది పినిశెట్టికి లవ్ సిన్ ను ఎంతో ఆసక్తికరంగా చేసిన సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమా మంచి హిట్ అవ్వడంతో పూజిత పొన్నాడకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా పూజిత 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్' కల్కి సినిమాల్లో కూడా నటించారు.

 

ఔరంగజేబు కాలంనాటి కథతో క్రిష్మూవీ చేస్తున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన శాతకర్ణి , మణికర్ణిక చిత్రాలు హిట్స్ కాగా… ఇప్పుడు పవన్ తో కూడా అదే తరహా కథతో సినిమా చేస్తున్నాడు. కాగా ఈ మూవీ లో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సంగతి పక్కన పెడితే ఈ మూవీ లో ఐటెం సాంగ్ లో పూజిత పొన్నాడ నటించినట్లు సమాచారం. 

 

ఓ భారీ సెట్ లో ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తయిందని అంటున్నారు. పూజిత గతంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో ఓ రోల్ చేశారు. అలాగే రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం మూవీలో ఆది పినిశెట్టి లవర్ పాత్ర కూడా ఆమె చేయడం జరిగింది. పవన్ లాంటి స్టార్ హీరో పక్కన సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ కెరీర్ కి ఇది కలిసొచ్చే అంశమే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: