ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అన్ని కూడా అల్లల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి ఎప్పుడు ఎవరిని ఎలా సోకుతుందో తెలియని ఆందోళన పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఈ వ్యాధిని ఇప్పుడే అంతం చేయకపోతే మున్ముందు దీని ప్రభావం మరింతగా పెరుగుతుందని గుర్తించిన పలు దేశాలు ఇప్పటికే తమ ప్రజలను పూర్తిగా వారి వారి ఇళ్లకే పరిమితం చేస్తూ లాకౌట్ ప్రకటించాయి. మన దేశాన్ని కూడా ప్రధానమంత్రి మోడీ, ఈనెల 14వరకు 21 రోజుల పాటు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లాకౌట్ వలన ముఖ్యంగా ప్రజల మధ్య సామజిక దూరం తగ్గి కరోనా మరింతగా వ్యాప్తి చెందకుండా ఉంటుందని, అలానే ప్రజలు అందరూ కూడా దీని వెనుక ఉన్న వాస్తవాన్ని గ్రహించి, ప్రభుత్వం సూచించిన విధంగా ఎవరూ కూడా ఇళ్ళనుండి బయటకు రావద్దని ప్రధాని సహా పలువురు కోరడం జరిగింది. 

 

అయితే ఈ లాకౌట్ వలన అన్ని కార్యాలయాలు, సంస్థలు, ఆఫీసులు, వ్యాపార సమూహాలు వంటివి మూత పడడంతో పేద, దిగువ తరగతుల వారికి ఇది చాలావరకు సమస్యలు తెచ్చిపెడుతోంది. వారు పూర్తిగా పనులు లేక ఇంటికే పరిమితం అవడంతో వారికి జరుగుబాటు కూడా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే అది గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మేర ఆర్ధిక సాయాన్ని ప్రకటించగా, పలువురు ప్రముఖులు కూడా తమవంతుగా సాయాన్ని అందించడానికి ముందుకు వస్తున్నారు. 

 

ఇక ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుండి పలువురు నటీనటులు, దర్శకులు, సాంకేతికనిపులు, తమకు తోచిన మొత్తాన్ని కరోనా బాధితుల సహాయార్ధం విరాళం ఇస్తుండగా, నేడు కోలీవుడ్ భామ నయనతార, రోజువారీ సినిమా కార్మికులకు రూ.20 లక్షలు విరాళం ప్రకటించి తన మంచి మనసుని చాటుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో దినసరి కార్మికులను, వారి కుటుంబాలను ఆదుకోవడం మన విధి అని, అందుకే తనకు వీలైనంత సాయం చేస్తున్నానని, మిగతావారు కూడా ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తే అది వారికి ఎంతో మేలు చేస్తుందని నయనతార అంటున్నారు...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: