సినిమా మేకింగ్ లో  ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్.  కొంతమంది సంవత్సరాలు సంవత్సరాలు టైమ్ తీసుకుంటుంటే.. కొంతమంది సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తారు. అయితే ఈ సారి ఎలా అయినా అనుకున్న టైమ్ కి సినమాలు చేద్దామని దీక్షపూనిన ఈ డైరెక్టర్లకు మాత్రం దీక్షాభగ్నం అయిపోయింది.

 

సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఆల్ మోస్ట్ఈ టైమ్ కి రిలీజ్ చేద్దాం అని రఫ్ ఐడియా వేసుకుంటారు డైరెక్టర్లు . బట్.. ఒక్కోసారి అది అటూ ఇటూ అవుతూ ఉంటుంది. కొరటాల ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఈ క్రేజీకాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాని ఎట్టిఈ పరిస్తితుల్లో 100 రోజుల్లోపు పూర్తి చేస్తానని చిరంజీవికి సభాముఖంగా మాటిచ్చాడు కొరటాల. కానీ  కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు షూటింగ్ జరిగే పరిస్తితి లేకపోవడంతో దాదాపు నెల రోజులు షూట్ కి బ్రేక్ వచ్చేసింది. సో..ఇలా కొరటాల 100 రోజుల్లోపు సినిమా షూట్ కంప్లీట్ చేస్తానన్న దీక్ష భగ్నం అయిపోయింది.

 

ప్రస్తతం సుకుమార్  ఇలాంటి పరిస్తితుల్లోనే ఉన్నాడు. సుకుమార్ సినిమాల్లోకి వచ్చి 16 ఏళ్లైంది. కానీ చేసింది మాత్రం 8 సినిమాలు. అంటే యావరేజ్ గా రెండేళ్లకో సినిమా చేస్తున్నాడు. కానీ రంగస్థలం అయిపోయాకమాత్రం.. ఈ సారి అంత టైమ్ తీసుకోను.. ఎర్లీగానే వస్తానని చెప్పాడు. సుకుమార్ 2018 లో వచ్చిన రంగస్థలం తర్వాత ఇప్పటివరకూ సినిమా చెయ్యలేదు. బన్నీ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశాడు. అయితే ఈ సినిమా లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసినా.. ఈ ఇయర్ ఎండింగ్ కి కంప్లీట్ చేద్దామనుకున్నాడు. కానీ ఈ కరోనా ఎఫెక్ట్ తో అంతకంతకూ పోస్ట్ పోన్ అయిపోతోంది షూటింగ్. ఇలా సుకుమార్ రెండేళ్లు టైమ్ తీసుకోను అన్న మాట అలా మిస్ అయిపోయింది.

 

పూరీ జగన్.. అసలు ప్రజెంట్ టాలీవుడ్ డైరెక్టర్లలో వైరీ యూనిక్ స్టైల్ పూరీది. ఎప్పటికప్పుడు సినిమాల్ని పరిగెత్తించడం పూరీ తర్వాతే ఎవరైనా. మ్యాగ్జిమమ్.. 3నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసేస్తాడుపూరీజగన్. ఇప్పటివరకూ పూరీ 3నెలలకు మించి టైమ్ తీసుకున్న సినిమా మహేష్ తో చేసిన బిజినెస్ మ్యాన్.  ఆ తర్వాత ఏ సినిమా అయినా మ్యాగ్జిమమ్ 3 నెలలే. ఇప్పుడు ఆ ట్రాక్ మిస్ అయ్యాడు జగన్.

 

ఎందుకంటే పూరీ కనెక్ట్స్ , కరణ్ జోహార్ ప్రొడక్షన్స్ లో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా ప్యాన్  ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా స్టార్ట్ అయ్యి రెండున్నర  నెలలు అవుతోంది. ఇంకా సినిమా ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే అయ్యింది. ఇంకా చాలా  షూటింగ్ జరగాల్సి ఉంది. సో.. పూరీజగన్ కూడా తన ఫ్లో  మిస్ అయ్యాడు.   ఇలా.. డైరెక్టర్లకు అనుకున్న టార్గెట్ మిస్ అయిపోయి, ట్రాక్ తప్పి, ఫ్లో మిస్ అయిపోయింది పాపం.

మరింత సమాచారం తెలుసుకోండి: