భారతీయ చలన చిత్ర రంగంలో అందాల నటి దివంగత శ్రీదేవి కి ఎంత పేరు ఉందో అందరికీ తెలుసు. అతి చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన శ్రీదేవి భారతీయ సినిమా రంగంలో అన్నీ చలనచిత్రరంగంలో నటించింది. దాదాపు స్టార్ హీరోలందరి పక్కన నటించిన శ్రీదేవి భారతీయ సినిమా ప్రేక్షకులలో తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ప్రమాదవశాత్తు దుబాయిలో బాత్ రూమ్ లో కాలుజారి తల పగిలి చనిపోవడం జరిగింది. ఈ క్రమంలో శ్రీదేవి బతికుండగానే తన పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ని సినిమారంగంలోకి ఎంట్రీ చేయించింది. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే శ్రీదేవి చనిపోవడం జరిగింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ అడపాదడపా అవకాశాలు అందుకుంటూ బానే కెరియర్ ని నెట్టుకొస్తోంది.

 

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలులోకి తీసుకు రావడంతో, దేశంలో అన్ని రంగాలు స్తంభించిపోయాయి. సినిమా షూటింగులు కూడా అన్ని ఆగిపోయాయి. దీంతో పేదవాడి నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన జాహ్నవి కపూర్ కరోనా వైరస్ వల్ల వచ్చిన పరిస్థితుల నుండి నేర్చుకుంటున్న గుణ పాఠాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆహారం విలువ ఏంటో తెలిసింది అని ఇంకా చాలామంది ఆహారం కోసం ఏ విధంగా కష్టపడతారో కరోనా వైరస్  లాక్‌ డౌన్‌ నేర్పింది అని చెప్పుకొచ్చింది.

 

అంతేకాకుండా జీవితాన్ని నెట్టుకురావడం కోసం బాగా కష్టపడే అభాగ్యుల గురించి ఇంత కాలం ఆలోచించకుండా నేనెంత స్వార్థంతో, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించానో తెలుసుకున్నాను’ అని ఆమె త‌న అభిప్రాయాన్ని నిజాయితీగా వెల్ల‌డించారు. ఇంట్లో పెద్ద వాళ్ళని గౌరవించాలని బాధ్యతగా బతకాలని తాజాగా కరోనా వైరస్ వల్ల ఏర్పడిన పరిస్థితి నేర్పింది అని చెప్పుకొచ్చింది. దీంతో తల్లి శ్రీదేవి అభిమానులు కూడా కూతురు జాహ్నవి కపూర్ చేసిన కామెంట్లకు రిప్లై ఇచ్చారు. నీకు ఉన్నవి అన్నీ శ్రీదేవి పోలికలే...చిన్ననాటి నుండే నీ తల్లి..బాగా కష్టపడి మంచి పేరు సంపాదించింది. ఆ తల్లి పేరు పోగొట్టకు మహాతల్లి అంటూ రిప్లై ఇచ్చారు. మరి కొందరు అయితే ఇలా అయితే ఎలా..?, ఇంత సున్నితంగా ఉంటే ఇండస్ట్రీలో రాణించడం కష్టం, కొద్దిగా కష్టానికి అలవాటు పడాలి జాహ్నవి కపూర్ అంటూ సలహాలు ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: