నయనతారది పదిహేనేళ్ళ పై దాటిన సినీ కెరీర్. సౌత్ ఇండియా సూపర్ స్టార్. ఇంతకాలం టాప్ హీరోయిన్ గా  కంటిన్యూ కావడం ఒక రికార్డ్. ఇక నయన్ లేడీ ఓరియెంటెండ్ మూవీస్ చేస్తూ తన సత్తాను చాటుకుంటూ వస్తోంది. ఎన్నో మెమొరబుల్ మూవీస్ చేసి వాటినే  తన అసెట్ గా మార్చుకుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే నయన్ గురించి ఏమిటన్నది  ఆ మూవీస్ చెబుతాయి.

 

ఆమె వయసు ఇపుడు మూడున్నర పదులు దాటింది. పెళ్ళి ఈడు దాటిందా లేదా అన్నది పక్కన పెడితే ఆమె ప్రేమలు మాత్రం చాలా సార్లు పెటాకులు అయ్యాయి. శింబూతో  తొలి రొమాన్స్ చెట్టెక్కిపోయింది. ఆ తరువాత డ్యాన్సింగ్ డాల్ ప్రభుదేవాతో కాపురం దాకా కధ నడచినా కంచికి మాత్రం చేరలేకపోయింది.

 

ఇక డైరెక్టర్ విఘ్నేష్ తో మాత్రం ఏ విఘ్నాలు లేకుండా ముచ్చటగా మూడవ ప్రేమ ఏళ్ళ తరబడి సాగుతోంది. నయన్ విఘ్నేష్ పెళ్ళి ఎపుడు అన్న వారి  నోటికి తాళం వేస్తూ వరసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది ఈ అమ్మడు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నీతిని  నయన్ ఫాలో అవుతోంది. ఆమెకి ఇప్పటికీ కోలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది.

 

అయితే చేతిలో ఇంకా సినిమాలు ఉండగానే నయన్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుందిట. తన ప్రేమికుడు విఘ్నేష్ తో పెళ్ళి పీటలెక్కాలనుకుంటోందిట. దానికి కారణం ఇంట్లో వారు వత్తిడి చేయడమేనట. ఇప్పటికే లేట్ అయింది. ఇక చాలు సినిమాలు ముందు తాళి కట్టించుకోమని తొందర పెడుతున్నారుట. దాంతో నయన్ మనసు మారిందని అంటున్నారు.

 

అన్నీ కుదిరితే ఈ ఏడాది ఎండింగు నాటికి నయన్ పెళ్ళి జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి పెళ్ళి తరువాత నయన్ సినిమాలు చేస్తుందా లేదా అన్నది ఆ తరువాత చూడాలి. ఏది ఏమైనా నయన్ పెళ్ళి వార్త మాత్రం ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూసే అని చెప్పాలి. ఈసారికి ఇది ఫేక్ న్యూస్ మాత్రం కాదు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: