సోషల్ మీడియాలో అప్డేట్ లో ఉండే బన్నీ తన ఫ్యామిలీ పిక్స్ కూడా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తన ముద్దుల కొడుకు అయాన్, కూతురు అర్హకు సంబంధించి బన్నీ షేర్ చేసే వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం అయాన్ చేసిన ఓ ఫీట్ ను బన్నీ వైఫ్ స్నేహ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

 

అల్లు అయాన్ చేసిన రేర్ ఫీట్ ను నింజా జంప్ అంటూ స్నేహ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అయాన్ ఓ టేబుల్ మీదకి జంప్ చేస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది. ఎవరి సపోర్ట్ లేకుండా తనకు తానే ఆ టేబుల్ పైకి జంప్ చేసి ఏమాత్రం తడబడకుండా లేచి నుంచున్న అయాన్ వావ్ అనిపిస్తున్నాడు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు అయాన్ ఈ ఫీట్ చేసాడనే చెప్పాలి. ‘నింజా జంప్ బై లిటిల్ నింజా.. నింజా లైఫ్’ అంటూ స్నేహ తన వాల్ లో రాసుకుంది. ఈ వీడియోను అల్లు అర్జున్ ఎడిట్ చేసాడని కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

 

 

సినిమాలకు సంబంధించి గానీ.. పర్సనల్ లైఫ్ కు సంబంధించి కానీ అల్లు అర్జున్ నుంచి ఏ న్యూస్ వచ్చినా సెన్షేషన్ అవుతూ ఉంటుంది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘తండ్రిని మించిన తనయుడు’, ‘రేర్ ఫీట్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సంక్రాంతికి అల.. వైకుఠపురములో సినిమాతో భారీ బ్లక్ బస్టర్ హిట్ ఇచ్చాడు బన్నీ. ఈ సినిమాతో తన రేంజ్ కలెక్షన్లను రుచి చూపించాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#quarantinelife Shot-Edited-Directed by @alluarjunonline

A post shared by allu sneha Reddy (@allusnehareddy) on

మరింత సమాచారం తెలుసుకోండి: