తెలుగు చిత్రపరిశ్రమలో అర్జున్ రెడ్డి సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించినదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది ఈ అర్జున్ రెడ్డి సినిమా. ఒక సాదాసీదా హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ హీరో గా మార్చేసింది. ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా అద్భుతంగా రాణించింది . ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒక్క సినిమాతో విజయ్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అయితే ఇప్పుడు విజయ్ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ఎందుకు అంటారా.. అర్జున్ రెడ్డి లాంటి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తే ఎలా ఉంటుంది... మెగాస్టార్ ఏంటి అర్జున్ రెడ్డి రోల్  ఏంటి అంటారా... అయితే ఇది నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. 

 

 

 అర్జున్ రెడ్డి పాత్రలో  చిరంజీవి ఊహించుకోలేకుండా ఉన్నప్పటికీ ఇది మాత్రం వాస్తవమే . ఇంతకీ ఇది ఎలా సాధ్యం అంటారా. అయితే ఇది ప్రస్తుతం జరిగిన విషయం కాదు కొన్నేళ్ళ క్రిందట జరిగిన విషయం. అప్పట్లో చిరంజీవి కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు.. దర్శకులందరూ చిరంజీవితో సినిమా తీయాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే కన్నడ దర్శకుడు నటుడు అయిన ఉపేంద్ర మెగాస్టార్ చిరంజీవి కోసం  ఒక కథ సిద్ధం చేశారట. అయితే ఉపేంద్ర 90ల్లో ఎన్నో సంచలన సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తనదైన స్టైల్ బోల్డ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఉపేంద్ర. దర్శకత్వంలోనే కాకుండా నటుడిగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 

 

 

 ముఖ్యంగా ఓంకారం, ఏ, రా , ఉపేంద్ర ఇలాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించారు. ఉపేంద్ర కి వస్తున్న సక్సెస్ చూసి అటు చిరంజీవి కూడా ఉపేంద్ర తో ఒక సినిమా చేయాలని అప్పట్లో ముచ్చట పడ్డట్లు వార్తలు కూడా వచ్చాయి. అశ్వినీదత్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించాలని అనుకున్నారట. అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ కి హాజరైన కన్నడ దర్శకుడు నటుడు హీరో ఉపేంద్ర ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అప్పుడు చిరంజీవితో తీయాలనుకున్న సినిమా కాస్త పట్టాలెక్కి ఉంటే మరోలా ఉండేది అంటూ దర్శకుడు ఉపేంద్ర అన్నారు. ఇక ఇదే సమయంలో  ఉపేంద్ర దగ్గర అసిస్టెంట్ గా  పనిచేసిన వై.వి.యస్.చౌదరి కూడా ఉన్నాడు. ఆ తర్వాత మాట్లాడిన ఉపేంద్ర అసిస్టెంట్ చౌదరి.. 90ల్లో చిరంజీవి కోసం ఉపేంద్ర అర్జున్ రెడ్డి కంటే పవర్ఫుల్ స్క్రిప్టు రెడీ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అన్నీ కుదిరితే ఈ సినిమా పట్టలేక పోతుంది అనుకున్న సమయానికి కొన్ని కారణాలవల్ల సినిమా ఆగిపోయింది అని తెలిపారు. ఒకవేళ అప్పుడు ఆ సినిమా తెరపైకి వచ్చి  ఉంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా గురించి అంతగా మాట్లాడే వారు కాదేమో అన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: