దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  అంతకు ముందే థియేటర్లు, మాల్స్ అన్నీ క్లోజ్ చేసిన విషయం తెలిసిందే.  అయితే గత నెల 24 నుంచి దేశంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  దాంతో దినసరి కూలీలు.. సినీ కార్మికులు కష్టాలు పడుతున్నారు.  అయితే సినీ కార్మికుల కష్టాలు తీర్చేందుకు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కమిటీ ఏర్పాటు చేశారు.  ఈ చారిటీకి పలువురు సినీ, దర్శక, నిర్మాతలు ఇతర రంగానికి చెందిన వారు విరాళాలు ఇచ్చారు. 

 

ఈ నేపథ్యంలో, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు రేపటి నుంచి సీసీసీ నిత్యావసర సరుకులు, ఔషధాలు అందజేయనుంది.  ఇప్పటి కే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాటు చేసి ఉంచారు.   ప్రతిరోజు షూటింగ్ ఉంటే కానీ పూట గడవని కొంతమంది దినసరి కార్మికుల కోసం ఈ ఏర్పాటు చేస్తున్నామని.. అలాంటివారే ముందుకు వచ్చి ఈ సహాయాన్ని అందుకోవాలని అన్నారు.   టాలీవుడ్ కి చెందిన మొత్తం 24 విభాగాల్లోని పేద సినీ కార్మికుల జాబితాను ఇప్పటికే సీసీసీ సిద్ధం చేసింది.

 

సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, సీసీసీ కేవలం కరోనా కోసమే కాదని, భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా ముందుంటుందని అన్నారు.  మెగాస్టార్  చిరంజీవి కూడా ఇది నిరంతరం పనిచేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని స్థాపించారని వెల్లడించారు.  తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు తమ పేర్లను కమిటీలో నమోదు చేసుకోవాలని సీసీసీ సభ్యులు మరోపక్క సూచించారు.   ప్రజలు ఎలా ఇబ్బందుల్లో ఉన్న తమ వంతు సహాయం అందిస్తామని అంటున్నారు.    ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: