పూజాహెగ్డే... ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే టక్కున గురొచ్చే పేరు. సినీ ఇండస్ట్రీలో సెక్సీ సైరన్ గా పిలవబడే పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో, వరుస విజయాలతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది. ఒక పక్క అందాలను ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. ఎక్స్‌పోజింగ్ చేయడంలో కూడా ఒక్కొక్క హీరోయిన్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ కూడా తనదైన శైలిలో అందాలు ఆరబోస్తూ ఉంది. సినీ ఇండస్ట్రీలో అడ్డుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు పూజా నటించిన ప్రతీ సినిమాలో ఎక్స్‌పోజింగ్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య రిలీజైన 'అలవైకుంఠంపురంలో' సినిమాలో అమ్మడి తొడల మీదే ఫోకస్ చేసి సినిమా నడిపించారంటే అర్థం చేసుకోవచ్చు పూజా ఎక్స్‌పోజింగ్ గురించి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎక్స్‌పోజింగ్ తన మొదటి అస్త్రంగా వాడుకుంటూనే ఉంది.

 

IHG

 

నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ భామ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతున్న నటి పూజా హెగ్డే. స్టార్ హీరోల సరసన నటించేందుకు ఏకైక ఛాయిస్ గా మారిన ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈమె డేట్స్ కోసం హీరోలు సైతం వెయిట్ చేసే రేంజ్ ఈ బ్యూటీది. రెబెల్ స్టార్ ప్రభాస్ తో ప్రస్తుతం ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలోనూ కనిపించనుంది. ఇక బాలీవుడ్ లో సైతం ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతోపాటు తెలుగు స్టార్ హీరోలందరితోనూ నటిస్తున్నది. అయితే ఈ అమ్మడు గురించి ఈ మధ్య ఒక స్టార్ హీరో కొడుకుతో ప్రేమాయణం నడిపిస్తున్నదని వార్తలొచ్చాయి.

 

ఇలా కెరీర్‌పరంగా దూసుకెళ్తున్న పూజా హెగ్డే బాలీవుడ్‌లో ప్రముఖ హీరో వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాతో అఫైర్ నడుపుతున్నట్టు వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే వారిద్దరూ పలు సందర్భాల్లో మీడియాకు చిక్కడంతో వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువగానే ఏదో ఉందనే రూమర్ షికారు చేస్తోంది. ప్రస్తుతం రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వారిద్దరి డేటింగ్‌ గురించి బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పూజా హెగ్డే గానీ, అటు రోహన్ మెహ్రా గానీ పెదవి విప్పడం లేదు. వీరితోపాటు పూజా, రోహన్ గ్రూప్‌లో అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కూడా కలిసి ఉండటం గమనార్హం. మరి ఈ వార్తలపై పూజా ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: