తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళం సినిమా ఇండస్ట్రీలలో .. ఒక భాషలో సూపర్ హిట్టయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం హిట్ కొట్టడం మన వాళ్ళకే కాదు మిగతా భాషల మేకర్స్ కి అలవాటే. అయితే అలానే చేతులు మోచేతుల వరకు కాల్చుకున్న నిర్మాతలు ఉన్నారు. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. మసాలా, బాడి గార్డ్, గోపాల గోపాల రీసెంట్ గా వచ్చిన జాను..ఇలా చూస్తే టాలీవుడ్ లో ఫ్లాపయిన రీమేక్స్ చాలా ఉన్నాయి. అలాగే అన్నీ సినిమాలు ఫ్లాపవ్వవు. ఇలా తమిళం లో హిట్ అయిన సినిమాలని ఇక్కడ రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్న సినిమాలు వెంకీ కెరీర్ లో చాలా ఉన్నాయి. ఎక్కువగా వెంకీ సూపర్ గుడ్ ఫిలింస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చాలావరకు బ్లాక్ బస్టర్సే.

 

అయితే ఇప్పుడు ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో తీయాలంటే పెద్ద రిస్కే అని అందరికీ తెలిసిందే. అందుకు కారణం నెట్ ఫ్లిక్స్, అమోజాన్ లలో నెల తిరగకుండానే ఆ సినిమాని జనాలు చూసేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కరోనా విలయ తాండవంతో ఇక ఇప్పుడప్పుడే థియోటర్స్ వైపు జనాలు వెళ్ళే పరిస్థితే కనిపించడం లేదు. అయినా మేకర్స్ ధైర్యం చేసి సినిమాని రీమేక్ చేస్తుండటం గొప్ప విషయం.

 

అలా 2020 లో కొన్ని చిత్రాలు రీమేక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించగా మంచి సక్సస్ ని సాధించింది. అంతేకాదు ఇదే సినిమాని కోలీవుడ్ లో అజిత్ తో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 

 

కోలీవుడ్ లో ధనుష్ నటించిన ఈ మూవీ 100 కోట్ల వసూళ్ళని సాధించి ధనుష్ కెరీర్ లో గొప్ప సినిమాగా నిలిచింది. దాంతో ఈ సినిమాని నిర్మాత సురేష్ బాబు రైట్స్ కొన్నారు. నారప్ప టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. రాం పోతినేని తో కిషోర్ తిరుమల రెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ హిట్ సినిమా తడం కి రీమేక్. అయితే తాజా పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ రీమేక్ సినిమాలు హిట్ అందుకుంటాయా అన్న సందేహాలు మొదలయ్యాయట. అందుకు కారణం ఆల్రెడి చూసిన సినిమాని మళ్ళీ థియోటర్స్ కి వెళ్ళి చూసే ఆలోచన ని జనాలు విరమించుకోవడమేనట. పైగా కరోనా ఎఫెక్ట్. మరి ఇలాంటి పరిస్థితుల్లో రీమేక్ సినిమాలని ప్రేక్షకులు ఆదరించడం అంటే కత్తి మీద సామే.  

మరింత సమాచారం తెలుసుకోండి: