కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి దేశం మొత్తాన్ని ఏకం చేస్తున్నారు ప్రధాని మోదీ. ఇందులో భాగంగా ఆయన తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి ప్రపంచం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. మార్చి 22న జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5గంటలకు చప్పట్లు కొట్టాలని పిలుపునివ్వడం వంటి కార్యక్రమాలతో ప్రధాని జాతిని ఏకం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనే ఈ చర్యల్లో భాగంగా ఈరోజు రాత్రి 9గంటలకు 9నిముషాల పాటు విద్యుత్ నిలిపేసి దీపాలు వెలిగించాలని మోదీ పిలిపునిచ్చారు.

 

 

మోదీ ఇచ్చిన పిలుపుకు సంఘీభావంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన వంతు బాధ్యత తీసుకున్నారు. తన ట్విట్టర్ అకౌంట్ లో స్పందించారు. ‘అందరికీ నమస్కారం.. రాత్రి 9గంటలకు ఇళ్లలోని లైట్లన్నీ ఆర్పేసి దీపాలు వెలిగిద్దాం. ప్రధానమంత్రి గారి మాటను పాటిద్దాం. కరోనా లేని భారత్ ను సాధిద్దాం’ అని పిలుపునిచ్చాడు. ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది. రామ్ చరణ్ చెప్పిన మాటలకు ప్రధాని మోదీ స్పందించారు. రామ్ చరణ్ ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ.. ‘బాగా చెప్పావు. అందరూ లాక్ డౌన్ పాటించండి. వెలుగులు నింపండి. అందరం కలిసి కరోనాను తరిమికొడదాం’ అని రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్లకు భారీ స్పందన వస్తోంది.

 

 

మోదీ పిలుపు మేరకు సినీ సెలబ్రిటీలు అందరూ స్పందిస్తున్నారు. ప్రధాని చెప్పినట్టు చేయాలని కరోనాపై పోరాటంలో అందరూ కలిసి రావాలని సోషల్ మీడియా ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. మోదీ పిలుపుకు చిరంజీవి, నాగార్జున కూడా తమ మద్దతు తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేశారు. దేశంలో చాలామంది సెలబ్రిటీలు ఇస్తున్న పిలుపుకు మోదీ ప్రతిస్పందిస్తున్నారు. అయితే.. రామ్ చరణ్ ట్వీట్ ను మాత్రమే మోదీ ప్రత్యేకించి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: