ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న కరోనా ను కట్టడి చేయడం ఇప్పుడు శాస్త్రవేత్తలకు మరియు అన్ని దేశాల ప్రభుత్వాలకు చాలా కష్టతరమైన పని అయిపోయింది. వైరస్ సోకిన తర్వాత వచ్చే లక్షణాల కన్నా అది తేలికగా వ్యాపించే తత్వమే దానిని అత్యంత ప్రమాదకరం చేస్తోంది. ఇకపోతే అది వ్యాపించేందుకు అనేక మార్గాలు ఉండగా వైరస్ గాలిలో ఎంతసేపు బ్రతికే ఉంటుంది, చెక్కపై ఎంతసేపు బ్రతికి ఉంటుంది, పేపర్ పై ఎంతసేపు బ్రతికి ఉంటుంది మరియు ప్లాస్టిక్, స్టీలు వస్తువులపై బ్రతికి ఉంటుంది అని శాస్త్రవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు.

 

అయితే కరోనా త్రాగునీరు లేదా మురికి నీటిలో ఎంతసేపు బ్రతికి ఉంటుందన్న దానిపై మాత్రం ఇంకా తీవ్రంగా పరిశోధిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిశోధనలలో చాలా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా తాగునీటిని శుభ్రం చేసే యంత్రం మనం మన ఇళ్ళల్లో వాడుతూ ఉంటాం. అవి వైరస్ ను చంపగలవా లేదా అన్నదానిపై ఎన్నో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు చెప్పిన విషయం ఏమిటంటే నెదర్లాండ్స్ లో మురికి నీటిలో కరోనా బ్రతికే ఉందట.

 

 

ఇక త్రాగు నీటిని మరియు మురికి నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా కరోనా వంటి ఎన్నో వైరస్ లను వాటర్ ప్యూరిఫయర్లు చంపేస్తాయి. మనం క్యాన్ల ద్వారా రోజూ తాగే మినరల్ వాటర్ కూడా ఇలాంటి ప్యూరిఫయర్ల ద్వార తయారు చేసేదే. అయితే నోవెల్ కరోనా వైరస్ చాలా శక్తివంతమైనది కాబట్టి అవి వాటిని చంపగలదా లేదా అని చెప్పడం కష్టమే కానీ పూర్తిస్థాయిలో పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉందని అన్నారు. ఇకపోతే ఇంట్లో వాడే వాటర్ ప్యూరిఫైయర్లు మురికినీటిని శుద్ధి చేసి రోజువారీ అవసరాలకు ఉపయోగపడేలా రూపొందించిన విధానాలను పరిశీలించి వారు ఒక కొలిక్కి వస్తారని చెబుతున్నారు.

 

కాగా మురికి నీటిలో SARS-CoV-2 వైరస్ ఉన్నట్టు గుర్తించినట్టు నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు చెప్పారు. వేస్ట్ వాటర్ సర్వైలెన్స్ ద్వారా పొలియోవైరస్ యాంటీబయాటిక్ రిసిస్టెంట్ బ్యాక్టిరీయాలను గుర్తించేందుకు సమర్థవంతంగా పనిచేసే మెథడ్ ద్వారా దీనిని గుర్తించామన్నారు. మురికి నీటిలో కనిపించే వైరస్.. తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ.. జనాభాలో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో పర్యవేక్షించేందుకు సున్నితమైన టూల్ గా పనిచేస్తుందని వారు చెప్పారు. అందుకే తాగునీరు వాడుకునే నీటిని శుధ్ది చేసే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: