తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగిన హీరో జగపతిబాబు. అప్పట్లోనే క్లాసికల్ సినిమాలు తీస్తూ స్టార్ హీరోస్ కి ముచ్చెమటలు పట్టించిన తర్వాత క్రమేపీ పతనం చవిచూశారు. ఇక అదే సమయంలో దక్షిణ భారత దేశంలో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న సౌందర్య టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.

 

తెలుగులో పదుల కొద్దీ సినిమాలు చేసిన ఆమె ఎంతో మంది అభిమానులను సంపాదించగా ఇప్పటికీ చాలామంది మధ్య వయసు వారికి సౌందర్యా నే తమ ఫేవరెట్ హీరోయిన్ .టాలీవుడ్లో ఆమెతో సినిమా చేయాలి అని అనుకోని దర్శకులు అప్పట్లో లేరు అంటే అతిశయోక్తి కాదు.

 

ఒక సినిమాలో హీరోయిన్ గా సౌందర్య చేసింది అంటేనే దానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఇకపోతే జగపతిబాబు, సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకి అప్పట్లో చాలా మంచి మార్కులు పడ్డాయి. వారి ఇద్దరి జోడీ కూడా చాలా చూడముచ్చటగా ఉండేది అని చెప్పేవారు. మూడుముక్కలాట, అల్లరి ప్రేమికుడు, భలే బుల్లోడు ఇలా చాలా సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. అలాగే వారి అన్యోన్యతను చూసి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది.

 

అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వదంతులను నిజమేనని జగపతి బాబు స్పష్టం చేశాడు. తనకి సౌందర్య తో ఎఫైర్ ఉండేదని చాలా ఓపెన్ గా చెప్పేశాడు. అవును అప్పట్లో సౌందర్యతో నాకు అఫైర్ ఉండేదని, కాని అది అంతా అనుకుంటున్నట్లు లైంగిక సంబంధం కాదని అన్నాడు. సౌందర్య అన్నయ్య అమర్ కూడా తనకు బాగా క్లోజ్ అనిరెండు కుటుంబాలు ఒకటి రెండు సార్లు ఫార్మాలిటీకి అన్నట్లు కాకుండా తరుచుగా స్నేహంగా కలుసుకుంటూ ఉండేవని చెప్పుకొచ్చాడు. సౌందర్య ఇంటికి తాను తన ఇంటికి సౌందర్య కూడా తరుచూ వస్తుండేదని వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: