తెలుగు ఓటిటి డిజిటల్ స్ట్రీమింగ్ ఆహాకు ఈ లాక్ డౌన్ టైం బాగా కలిసి వచ్చింది. ఇప్పటికే 10 లక్షల డౌన్ లోడ్స్ కాగా తమ సబ్ స్క్రైబర్స్ కు మరింత స్టఫ్ అందించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మస్తీ, లాక్డ్ వెబ్ సీరీస్ లని రిలీజ్ చేసిన ఆహా లేటెస్ట్ గా సిన్ అంటూ ఒక అడల్ట్ బేస్డ్ వెబ్ సీరీస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ చూస్తే పక్కా డిజిటల్ కంటెంట్ అదేనండి డిజిటల్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే కంటెంట్ తో వస్తున్నారని తెలుస్తుంది. 

 

ట్రైలర్ లోనే సినిమా కాన్సెప్ట్ తెలిసేలా చేసిన ఈ వెబ్ సీరీస్ కచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. యూత్ కి కావాల్సిన బెడ్ రూమ్ సీన్స్ తో పాటుగా మంచి మెసేజ్ తో ఈ వెబ్ సీరీస్ వస్తుంది. నవీన్ మేడారం డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరీస్ ను శరత్ మరార్ నిర్మించారు. ఆహా లో క్రిష్ కూడా వరుస వెబ్ సీరీస్ లు నిర్మిస్తున్నారు. మస్తీ, రన్ తర్వాత oka ఏడాది పాటు సరిపడా వెబ్ సీరీస్ లను ప్లాన్ చేస్తున్నారు. 

 

ఒకవిధంగా చూస్తే ఆహా యాప్ సక్సెస్ అయినట్టే అని చెప్పొచ్చు. డిజిటల్ స్ట్రీమింగ్ కు ఆదరణ లభిస్తున్న ఇలాంటి టైం లో ఆహా మంచి స్కోర్ తెచ్చుకుంటుంది. సిన్ లాంటి వెబ్ సీరీస్ లు మరో రెండు మూడు ప్లాన్ చేస్తే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కు ఆహా మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే టెక్నీకల్ ప్రాబ్లెమ్స్ రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కాబట్టి టెక్నీకల్ గా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటే బెటర్. 10 లక్షల డౌన్ లోడ్ కే యాప్ ఆగిపోతే ట్రాఫిక్ ఇంకా పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: