టాలీవుడ్ లో ఘనమైన సినీ కుటుంబాల్లో ఒకటి అక్కినేని ఫ్యామిలీ. ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి మూడో తరం హీరోలుగా అక్కినేని నాగ చైతన్య, అఖిల్ రాణిస్తున్నారు. చైతన్య కెరీర్ సాఫీగానే కొనసాగుతోంది. కానీ.. అఖిల్ పరిస్థితి విచిత్రంగా ఉంది. చేసిన మూడు సినిమాలు ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ అనే సినిమా చేశాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమాపై కరోనా పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి.

 

 

సినిమా హీరోగా అఖిల్ కు, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు కీలకంగా మారింది. వరుస ఫ్లాపులు చూస్తున్న అఖిల్.. ఫ్లాప్ దర్శకుడిగా ముద్ర పడ్డ భాస్కర్.. ఇద్దరూ నిరూపించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ బయటి హీరోలకు బాగా కలిసొస్తుందని సెంటిమెంట్ ఉంది. నాగ చైతన్య, నాని, విజయ్ దేవరకొండకు గీతా ఆర్ట్స్ లో భారీ హిట్లు పడ్డాయి. ఈ సెంటిమెంట్ పై కూడా అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడి ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి.

 

 

విడుదలయ్యాక జనం ధియేటర్లకు ఏమేరకు వస్తారు.. మిగిలిన సినిమాల నుంచి పోటీ ఎలా ఉంటుంది.. హిట్ టాక్ వచ్చినా మంచి రన్నింగ్ ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల ప్రభావంతో జనాల్ని ధియేటర్లకు రప్పించటమంటే మామూలు విషయం కాదు. ఏమాత్రం టాక్ తేడా ఉన్నా నిరాశ తప్పదు. మామూలు రోజుల్లో టాక్ బాగుంటే ప్రేక్షకుల ఆదరణ వేరేగా ఉండేది. కానీ.. కరోనా వచ్చి అన్ని వ్యవస్థలను కుప్పకూల్చేసింది. కాబట్టి అఖిల్ కు ఇది విషమ పరిక్ష అనే చెప్పాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: