గత ఎన్నికలలో పవన్ ‘జనసేన’ కు సుమారు 7 శాతం ఓట్లు పడ్డాయి అంటే కనీసం ఆ స్థాయిలో ఓట్లు వేయించడానికి పవన్ అభిమానులు జనసైనికులు ఎంతో కష్టపడ్డారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పవన్ ఎమ్ఎల్ఎ గా కూడ ఓడిపోవడంతో తన అభిమానులు పూర్తిగా తన విజయం కోసం కష్టపడలేదు అన్న అభిప్రాయాన్ని పవన్ తన కామెంట్స్ రూపంలో అనేకసార్లు తెలియ చేసాడు. 


దీనితో ధైర్యం చెప్పవలసిన జనసేనాని తమ ఉత్సాహం పై నీళ్ళు జల్లినందుకు అప్పట్లో పవన్ అభిమానులు చాలామంది నొచ్చుకున్నారు. అయినా పవన్ అంటే అతడి అభిమానులకు ఉండే విపరీతమైన ఇష్టం పవన్ నుంచి అతడి అభిమానులను దూరంచేయలేదు. 


ప్రస్తుత వ్యతిరేక పరిస్థితులలో కరోనా సమస్యలు చుట్టుముడుతున్నా ఆ విషయాలను పట్టించుకోకుండా చాలామంది పవన్ అభిమానులు జనసైనికులు తమ సొంత డబ్బులు ఖర్చుపెట్టి పేద కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులు కూరగాయలు పవన్ అభిమానులు కొన్నిచోట్ల పంచిపెడుతూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని హడావిడి చేస్తున్నారు. ఈ విషయాలు పవన్ దృష్టికి వెళ్ళినా పెద్దగా పట్టించుకోకుండా కనీసం తన అభిమానులు చేస్తున్న సేవలను గుర్తిస్తూ పవన్ ఇప్పటి వరకు ఒక్క ట్విట్ కూడ చేయలేదు. అయినా పవన్ అభిమానులు పట్టించుకోలేదు. 


అయితే తన అభిమానులను వదిలిపెట్టి బిజేపి నాయకులు చేస్తున్న ట్విట్స్ ను రీ ట్విట్ చేస్తూ అదేవిధంగా కరోనా క్రైసిస్ ఫండ్ కు విరాళాలు ఇచ్చిన సినిమా సెలెబ్రెటీలను అభినందిస్తూ పవన్ చేస్తున్న కామెంట్స్ తో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాత అప్ డేట్స్ తో నిండిపోతోంది. ఇక లేటెస్ట్ గా ప్రధానమంత్రి మోదీ సందేశం ప్రకారం ఆదివారం అందరూ దీపాలు వెలిగించాలని పవన్ పిలుపు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనితో పవన్ అభిమానులు కూడ పవన్ సూచనకు ఎలా స్పందిస్తారు అన్న సందేహాలు కొందరికికలుగుతున్నాయి. కరోనా బాధితుల సహాయం కోసం పవన్ అభిమానులు ఎంతో చేస్తున్నా ఆ విషయాలను పట్టించుకోకుండా కేవలం జాతీయస్థాయి నాయకులు చేసే ప్రకటనలు మాత్రమే పవన్ కళ్యాణ్ పట్టించుకుంటాడ అన్న బాధ పవన్ వీరాభిమానులలో ఉన్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: