క్రిష్ణగాడి వీరగాడి ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన భామ మెహ్రీన్ కౌర్ ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి విజయాలని అందుకుంది. ఆమె కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఎఫ్ 2 చిత్రం నిలిచింది. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమె ఎన్నో చిత్రాల్లో చేసినప్పటికీ సరైన విజయం అందలేదు. చూపుతిప్పుకోలేని అందం ఆమె సొంతం అయినప్పటికీ సినిమాల్లో నెగ్గుకురావాలంటే అదొక్కటే సరిపోదని ఆమెను చూస్తే తెలుస్తుంది.

 

 

ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాలు ఎంత మంచివాడవురా బాక్సాఫీసు వద్ద తేలిపోయింది. ఎమోషన్స్ ప్రధానంగా చూపించిన ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్ర బాగున్నప్పటికీ సంక్రాంతి పోటీగా వచ్చిన సినిమాలతో నిలబడలేక చతికిలపడిపోయింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న నాగశౌర్య హీరోగా అశ్వద్ధామ సినిమాలో కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిలవడంతో పాటు నిర్మాతతో గొడవలు తెచ్చుకుంది మెహ్రీన్..

 

 

తెలుగుతో పాటు తమిలంలోనూ నటించిన మెహ్రీన్ అక్కడ కూడా విజయాలు పొందలేకపోయింది. ధనుష్ హీరోగా పటాస్ పేరుతో వచ్చిన చిత్రం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు బాగా తగిపోయాయి. తెలుగులో ప్రస్తుతం ఆమె సైన్ చేసిన చిత్రాలేవీ లేవు. దాంతో ఆమె చూపు బాలీవుడ్ పై పడింది. ప్రస్తుతం అక్కడ వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతుంది.

 

 

అందువల్ల అక్కడ ఆమె ప్రయత్నం మొదలుపెట్టిందట. సినిమాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధం అవుతుందట. నెట్ ఫ్లిక్స్ లో రానున్న ఒకానొక సిరీస్ లో ఆమె కనిపించనుందట. సినిమాల్లో అన్ లక్కీ గర్ల్ గా ఉన్న మెహ్రీన్ కి వెబ్ సిరీస్ ల ద్వారా లక్ వస్తుందేమో చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: