ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ దేశ‌దేశాలు వ్యాపించి.. ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.  కరోనాను నుంచి ప్రజలను రక్షించేందుకు పలు దేశాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. సగం దేశాల్లో లాక్‌డౌన్‌ అమలవుతుండగా.. 350 కోట్ల మంది ప్రజల నిర్బంధంలోనే కొనసాగుతున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఆగ‌డం లేదు. అయితే బుల్లితెర‌కు మాత్రం క‌రోనా బాగానే క‌లిసొచ్చింది.

 

క‌రోనా వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో చాలా దేశాలు లాక్‌డౌన్ విధించాయి.  ఈ నేపథ్యంలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరు ఇంటికే పరిమితం అవుతున్నారు. దీనితో చాలా మందికి ఆటవిడుపు అనేది లేకుండా పోతుంది. ఇక మెజారిటీ ప్రజలు టీవీలకు అతుక్కుపోతున్నారని సమాచారం.  ఓటీటీలతో పాటు శాటిలైట్‌ ఛానెల్స్‌ కూడా భారీగా టీఆర్పీ రేటింగ్‌ ను దక్కించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉగాది కానుకగా విడుదలైన రెండు హిట్ చిత్రాలు రికార్డు టీఆర్పీ దక్కించుకున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు  సినిమా 23.4 టీఆర్పీ ద‌క్కించుకుని  ఆల్ టైం రికార్డు నమోదు చేసింది.

 

అలాగే ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే చిత్రం సైతం అదే రోజు మా టివిలో ప్రసారమై 15.3 టీఆర్పీ ద‌క్కించుకోవ‌డం విశేషం. ఇక చాలా కాలం నాటి రామాయణంను తాజాగా దూరదర్శిణిలో వేయగా ప్రేక్ష‌కులు దాన్ని కూడా మిస్ అవ్వ‌డం లేదు. దేశ వ్యాప్తంగా రెండు ఎపిసోడ్స్‌కే ఏకంగా 8.1 మిలియన్‌ల వ్యూస్‌ వచ్చాయట. ఇక మొన్న వారం ప్రసారం అయిన సుమ ‘క్యాష్‌’ పోగ్రాం కూడా దుమ్ము రేగిపోయేలా టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇంకా ప్రముఖ షోలు ఇంకా సీరియల్స్‌ కూడా రేటింగ్‌ విషయంలో గతంలో ఎప్పుడు చూడని సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఏదైతేనేం.. అన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్న క‌రోనా.. బుల్లితెర‌కు మాత్రం క‌లిసొచ్చింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: